'సరి బేసి'తో 15రోజుల్లో రూ.2 కోట్ల జరిమానా వసూలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు గాను పదిహేను రోజుల పాటు సరి బేసి విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సరి బేసి అమలు నేపథ్యంలో జరిమానా రూపంలో రూ.2 కోట్లకు పైగా వసూలైనట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ పదిహేను రోజుల్లో ట్రాఫిక్‌ పోలీసులు దాదాపు పదివేల చలానాలు జారీ చేసినట్లు చెప్పారు. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీ నగరంలో సరి బేసి వాహన విధానం ట్రయల్‌ రన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

Delhi Govt Collects Over Rs 2 Crore From Challans Issued During Odd-Even Scheme

ఈ విధానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సరి సంఖ్య తేదీల్లో సరి సంఖ్య రిజిస్ట్రేషన్‌ నెంబరు వాహనాలు, బేసి సంఖ్య తేదీల్లో బేసి సంఖ్య రిజిస్ట్రేషన్‌ నెంబరు వాహనాలు మాత్రమే రోడ్డుపై తిరగాలని నిబంధన విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.2వేలు చొప్పున జరిమానా విధించారు.

కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన ఇంకుతో ఓ యువతి దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది బిజెపి నేతల కుట్రగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. సరి - బేసి విధానం వెనుక భారీ స్కాం ఉందని సిరా చల్లిన భావన ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+