70 శాతం స్పెషల్ కరోనా ఫీ, నేటి నుంచి అమలు.. మందుబాబులకు ఆప్ సర్కార్ షాక్

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ షాక్ ఇచ్చింది. దాదాపు 40 రోజుల తర్వాత లిక్కర్ షాపులు తెరిచి ఉండటంతో మందుబాబుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. అయితే వారి సంతోషంపై ఢిల్లీ సర్కార్ నీళ్లు చల్లింది. హస్తినలో లిక్కర్ ఎంఆర్పీపై 70 శాతం స్పెషల్ కరోనా ఫీను ముక్కుపిండి మరీ వసూల్ చేస్తోంది. కరోనా ఫీ మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం స్పస్టంచేసింది.

 Delhi Govt to Impose 70% Special Corona Fee on Liquor

కరోనా పీతో రెవెన్యూ పెరుగుతోందని.. దీంతో సంక్షేమ పథకాల కోసం నగదు వెచ్చించొచ్చని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కరోనా పీకి సంబంధించి సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్నిరకాల మద్యంపై 70 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తామని తెలియజేసింది. ఉదహరణకు మందు బాటిల్ రూ.1000 ఉంటే దాని రూ.1700కు లభించనుంది.

Recommended Video

    Women Waiting In Queue In Front Of Wine Shops , Pics Viral

    మూడో విడత లాక్ డౌన్ ప్రకటించిన తొలిరోజున ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కంటోన్మెంట్ జోన్లలో లేని 150 మద్యం షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల సీఎం కేజ్రీవాల్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కరోనా పీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొరుగున గల హర్యానా కూడా కోవిడ్ సెస్ వేయాలని భావిస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలలో పన్నుల ద్వారా 3500 కోట్లు రాగా.. ఈ ఏడాది 300 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రెవెన్యూ మార్గాలపై కేజ్రీవాల్ సర్కార్ ఫోకస్ చేసింది. అయితే వైన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించకుంటే మూసివేస్తామని స్పష్టంచేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+