ఢిల్లీలో హై అలెర్ట్, విమానాశ్రయాల మూసివేత, ఛండీగడ్ లో సైరన్, దాడులకు ఛాన్స్!
ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ పాకిస్తాన్ మధ్య వార్ ఖరారైంది. భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ కు ప్రతిగా పాకిస్థాన్ నిన్న రాత్రి జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపై డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలతో దాడికి ప్రయత్నించగా భారత భద్రతా దళాలు సమర్ధవంతంగా తిప్పి కొట్టాయి. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను నేలకూల్చడంతో పాటు ఒక పాక్ పైలెట్‌ను పట్టుకున్నట్టు రక్షణశాఖ ప్రకటించింది.
ఢిల్లీలో హై అలెర్ట్.. ఢిల్లీ విమానాశ్రయానికి విమానాలు రద్దు
ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇండియా గేటు దగ్గర భద్రతను పెంచే ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ కి వెళ్లే రైలు నిలిపివేశారు ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వైపు వెళ్లే వాహనాలను కూడా నిలిపివేశారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు రద్దు చేశాయి.

27 విమానాశ్రయాల మూసివేత
భారత్ పై పాకిస్తాన్ దాడుల దృష్ట్యా కిషన్గఢ్, భుంతార్, లూథియానా విమానాశ్రయా లను మూసివేశారు. దీని కంటే ముందు - రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ తో సహా అనేక విమానాశ్రయాలను కూడా మూసివేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం ఇప్పటివరకు 46 దేశీయ విమానాల రాకపోకలు రద్దయ్యాయి.
ఛండీగడ్లో దాడులు జరిగే అవకాశం .. సైరన్ అలెర్ట్
ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉందని వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేసింది. చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది . పంచకుల, మొహాలి, పటియాల, అంబాలాలో కూడా ఇదే విధమైన హెచ్చరికలను జారీ చేశారు.
జమ్మూలోనూ మోగిన సైరన్
మరోవైపు జమ్ములో కూడా నేడు ఉదయం సైరన్ ముగించి హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు జమ్మూలోని నేడు ఉదయం సైరన్ లు మోగాయి. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో పేలుడు శబ్దాలు కూడా వినిపించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications