ఢిల్లీ అల్లర్ల కేసులో JNU విద్యార్ది నేత ఉమర్ ఖాలీద్ కు మరో షాక్-హైకోర్టు బెయిల్ నిరాకరణ
రెండేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ అలర్ల కేసులో జేఎన్యూ విద్యార్ధి సంఘం నేత ఉమర్ ఖాలిద్ కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఖాలిద్ పాత్రపై ఆధారాలున్నాయంటూ పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్న క్రమంలో ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్ధానం తోసిపుచ్చింది.
2020లో ఢిల్లీలోని ముజఫర్ నగర్ లో అల్లర్లు సృష్టించేందుకు పథక రచన చేశారన్న ఆరోపణలతో ఉమర్ ఖాలిద్ ను అదే ఏడాది సెప్టెంబర్లో ఉపా కేసు కింద అరెస్టు చేశారు. అయితే ఈ అల్లర్లతో తన పాత్ర లేదని, పథక రచన చేశాననేందుకు ఆధారాలు లేవని ఉమర్ ఖాలిద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఉమర్ ఖాలిద్ పాత్రపై ఆధారాలున్నాయన్నారు. దీంతో ఏకీభవించిన న్యాయస్దానం ఖాలిద్ బెయిల్ అభ్యర్దనలో ఎలాంటి మెరిట్ లేదంటూ తోసిపుచ్చింది.

ఢిల్లీలో 2020లో జరిగిన ముజఫర్ నగర్ అల్లర్లలో 53 మంది చనిపోగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్ల వెనుక ఉమర్ ఖాలిద్ తో పాటు షర్జీల్ ఇమామ్, ఇతరుల పాత్ర ఉందని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇవే ఆరోపణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి వీరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నా ఊరట దక్కలేదు. దీంతో ఈసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయినా పోలీసులు సమర్పించిన ఆధారాలను కోర్టు విశ్వసించి బెయిల్ తిరస్కరించింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications