ప్రధాని మోదీపై అనర్హత వేటు?: ఇంకో మూడు రోజుల్లో
Lok Sabha elections 2024: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ముమ్మరంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. జోరుగా సాగుతోంది.

కాగా- ఈ పరిణామాల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనర్హత వేటు వేయాలనే పిటీషన్ ఒకటి ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది. దీన్ని హైకోర్టు విచారణకూ స్వీకరించింది. నేడు ఈ పిటీషన్ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ- వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన అంటే సోమవారం నాడు ఈ పిటీషన్ ఢిల్లీ హైకోర్టు సమక్షానికి విచారణకు రానుంది.
ఈ పిటీషన్‌ను విచారించాల్సి ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా విధులకు హాజరు కాలేదు. ఆయన సెలవులపై వెళ్లారు. సోమవారం నాడు ఆయన విధులకు హాజరు కానున్నారు. జస్టిస్ సచిన్ దత్తా అందుబాటులో లేకపోవడం వల్ల నేడు జరగాల్సిన ప్రధాని మోదీ అనర్హత పిటీషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
లోక్‌సభ ఎన్నిలకల ప్రచార కార్యక్రమాల్లో దేవుళ్లు, మతాల పేర్లను విస్తృతంగా వినియోగిస్తోన్నారనే ఆరోపణలను ప్రధాని మోదీ ఎదుర్కొంటోన్నారు. హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా ప్రజలు కోల్పోయారంటూ తన కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే.

అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్‌లో ఎన్నికల ప్రచార సభలో దేవుళ్లు- దేవాలయాలు, హిందువులు- హిందూమతం, సిక్కులు- గురుద్వారాల పేర్లతో మోదీ ఎన్నికల్లో ప్రచారం చేశారని, ఇవన్నీ కూడా నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందటూ ఆనంద్ ఎస్ జోంధలే ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు.
అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తూ శ్రీరామచంద్రుడిని అవమానించిందంటూ ఫిలిభిత్ సభలో మోదీ ఆరోపించారు. సిక్కులు ప్రసాదంగా వడ్డించే లంగర్‌పై జీఎస్టీని ఎత్తేస్తామని, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తెరుస్తామంటూ మోదీ మరో సభలో హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications