Delhi Liquor Scam: మరింత బిగుసుకున్న ఉచ్చు..!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (Delhi Liquor Scam) వ్యవహారం..రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. మరింత బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలు అరెస్టులు చోటు చేసుకున్నాయి. సౌత్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో పలువురు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (Manish Sisodia) మనీష్ సిసోడియా సహా పలువురు సీనియర్ అధికారులు సైతం ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇప్పటికే మనీష్ సిసోడియా (Manish Sisodia)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందీ అరెస్ట్. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది.

మనీష్ సిసోడియా ప్రస్తుతం ఈడీ అధికారులు కస్టడీలో ఉంటోన్నారు. మనీ లాండరింగ్ (Money Laundering) చోటు చేసుకున్నట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. మనీష్ సిసోడియాను కస్డీలోకి తీసుకున్నారు. బుధవారం నాటితో సిసోడియా కస్టడీ ముగియాల్సి ఉంది. దీన్ని పొడిగించాలని కోరుతూ ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. దీనిపై ఎల్లుండే వాళ్లు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు (Delhi Rose Avenue Court) లో పిటీషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.

తాజాగా సీబీఐ అధికారుల కస్టడీని కూడా ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది కోర్టు. ఈడీ కస్టడీ ముగిసిన వెంటనే ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. 14 రోజుల పాటు విచారించనున్నారు. దీని తరువాత మళ్లీ ఈడీ అధికారులు ఆయనను తమ కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వ్యక్తి పలుకుబడి కలిగిన నాయకుడు కావడం వల్ల సాక్ష్యాధారాలను తారుమారు చేయగలిగే అవకాశాలు కూడా లేకపోలేదని సీబీఐ అధికారులు న్యాయస్థానంలో వాదించారు. అక్రమంగా కోట్లాది రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనీష్ సిసోడియా తరఫున సీనియర్ అడ్వొకేట్ దయాన్ కృష్ణన్- చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు.












Click it and Unblock the Notifications