వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కారైనా ఆగాల్సిందే: రూల్స్ బ్రేక్ చేస్తే 2వేలు ఫైన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన సరి-బేసి నెంబర్ విధానాన్ని వాహనదారులు తప్పక పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 1 నుంచి 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 2వేలు జరిమానా కట్టాల్సిందేనని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కారుకైనా ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ద్విచక్ర వాహనాలకు నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. అయితే ఆదివారం రోజు ఆ నిబంధనలు వర్తించవు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు రోడ్డు ఆంక్షలు వర్తిసాయి.

Delhi odd-even blueprint unveiled: CM Kejriwal, AAP MLAs not exempted

అయితే, 12 ఏళ్లలోపు పిల్లలతో ఉండి వాహనాలు డ్రైవ్ చేసే మహిళలు, సీఎన్‌జీ కార్లు వాడేవాళ్లు, వీఐపీలు ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని తెలిపారు. జనవరి 1 నుంచి ఉదయం 8గంటల నిబంధనలు వర్తిస్తాయని సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు.

నిబంధనల నుంచి మినహాయింపు పొందినవారు కూడా కొత్త నిబంధనలను పాటిస్తే అది పాజిటివ్ సంకేతాలను పంపుతుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు పాటించేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకారం తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు కూడా కొత్త ఆంక్షలను పాటిస్తే ఆదర్శవంతంగా ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం సరి, బేసి సంఖ్య నెంబర్లు ఉన్న వాహనాలు ఆయా తేదీలను బట్టి రోడ్డుపైకి రావాలి. దీని అర్ధం ఏమిటంటే నెంబర్ ప్లేట్‌లో చివరి సంఖ్య సరి సంఖ్య ఉంటే జనవరి 1 నుంచి ఆ రోజు ఆ కారే బయటకు వస్తుంది. బేసి సంఖ్య రోజు ఆ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డు మీద తిరిగేందుకు అనుమతి ఉంది.

కేజ్రీవాల్ 'సరి-బేసి' ట్రాఫిక్ రూల్స్ వల్ల ప్రయోజనాలు:

* న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన 19 లక్షలకు పైగా నాలుగు టైర్ల వాహనాలున్నాయి. ఈ కొత్త విధానం వల్ల రోజులో సగం వాహనాలు మాత్రమే తిరుగుతాయి.
* ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు అదనంగా న్యూఢిల్లీలో మరో 6వేల బస్సులు రోడ్డెక్కనున్నాయి.
* ఈ 15 రోజులకు గానూ ఎమర్జన్సీ వాహనాలు, పీసీఆర్‌లు దీని పరిధిలోకి రావు.
* ప్రభుత్వ నిర్ణయం విజయవంతమైతే ఈ విధానాలను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
* 15 రోజుల ట్రయల్ రన్‌లో భాగంగా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
* రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు, సీజేఐ, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, సుప్రీంకోర్టు జడ్జీలు, డిప్యూటీ స్పీకర్‌ల వాహనాలకు అనుమతి.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal on Thursday formally unveiled the blueprint for the introduction of the 'Odd-Even Formula for vehicles that will ply in the city and those coming in from the National Capital Region (NCR) from January 1 to January 15, 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X