మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి: సీపీఆర్ చేసి కాపాడిన జవాన్
న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్ ఆకస్మికంగా పడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడారు భారత జవాను. ఈ ఘటన ఢిల్లీలోని సంగ్లోయ్ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనిల్ కుమార్ (58) అనే వ్యక్తి మెట్రో స్టేషన్‌లో చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు.
దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జవాన్ ఉత్తమ్ కుమార్ వెంటనే స్పందించాడు. అనిల్‌కి కార్డియో పల్మనరీ రిససిటేషన్(CPR) అందించడం ద్వారా ప్రాణాలు కాపాడారు. సీపీఆర్ చేయడంతో వెంటనే ఆ ప్రయాణికుడు స్పహలోకి వచ్చాడు. దీంతో అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుక సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ తన ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేసింది. అనిల్ కుమార్ అనే ప్రయాణికుడికి సీపీఆర్ అందించడం ద్వారా ఎంతో విలువైన ప్రాణాల్ని సిబ్బంది కాపాడారని, అతడు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది.
#CISF personnel saved a precious life by giving CPR to a passenger namely Anil Kumar, R/O- Nangloi @ Nangloi Metro Station, DMRC, Delhi. Mr Anil Kumar thanked CISF profusely for saving his life. @HMOIndia @PIBHomeAffairs @MoHUA_India pic.twitter.com/DIVyqXyEJ6
— CISF (@CISFHQrs) November 5, 2023
కాగా,ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణ బేగంపేటలో కార్డియాక్ అరెస్ట్‌కు గురైన పాదచారికి సిటీ ట్రాఫిక్ ఏసీపీ సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. ఏసీపీ పి మధుసూధన్ రెడ్డి.. బేగంపేట ప్రధాన రహదారిపై 40 ఏళ్ల జీ రాము అనే తాపీ మేస్త్రీగా కుప్పకూలిని గమనించారు. దీంతో ఏసీపీ అతడికి సీపీఆర్ చేశారు.












Click it and Unblock the Notifications