అమ్మాయిలను చూస్తూ హస్త ప్రయోగం చేసిన పోకిరీల గుర్తింపు, పది మంది అరెస్ట్
ఢిల్లీ గార్గి కాలేజీలో అమ్మాయిలను చూస్తూ హస్తప్రయోగం చేసిన కేసులో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం జరిగిన ఆన్యువల్ డేలో భాగంగా అల్లరిమూకలు విద్యార్థినులను చూస్తూ హస్తప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

10 మంది అరెస్ట్..
ఘటనపై పోలీసులు ఐపీసీ 452, 354, 509, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హౌజ్ ఖాన్ పోలీసులు 11 బృందాలు ఏర్పాటు చేసి.. నిందితుల కోసం గాలించారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. దేశ రాజధాని పరిసరాలకు చెందిన 10 మందిని గుర్తించారు. అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరిని ప్రశ్నించారు. మరోవైపు కాలేజీ సిబ్బందిని కూడా విచారణ బృందం ప్రశ్నించింది.

35 మంది అల్లరిమూకలు..
గురువారం రాత్రి క్యాంపస్‌లోకి చొరబడ్డ దాదాపు 30-35 మంది మూక విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిల వైపు చూస్తూ హస్త ప్రయోగానికి పాల్పడ్డారు. క్యాంపస్‌లో వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే వారు క్యాంపస్ లోపలికి ప్రవేశించారని ఆరోపించారు.

కేజ్రీ సీరియస్..
గార్గి ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. మన బిడ్డలపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డవారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. మహిళా భద్రతపై ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కేజ్రీవాల్ పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications