జేఎన్‌యూ ఘటన విచారణ , ‘ఇండియా టుడే’ను ఆడియో టేపులు అడిగిన ఢిల్లీ పోలీసులు
జేఎన్‌యూలో దాడికి సంబంధించి 'ఇండియా టుడే చేసిన స్టింగ్ ఆపరేషన్' పెను దుమారం రేపింది. ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల ప్రమేయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియోలు, ఆడియో టేపులు పోలీసుల విచారణకు కూడా సహకారం అందిస్తుండటం విశేషం. జేఎన్‌యూ ఘటనకు సంబంధించి ఆడియో టేపులను ఇవ్వాలని మీడియా సంస్థను పోలీసులు అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆదివారం జరిగిన ఘటనల గురించి 'ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొదటి టేపుల్లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ, రెండో టేపులో ఏబీవీపీకి చెందిన రోహిత్ షా, మూడో టేపులో వామపక్షాలకు చెందిన విద్యార్థి గీతా కుమారి గురించి స్టింగ్ ఆపరేషనల్ ఇండియా టుడే రిపోర్టర్ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.
పార్ట్-2 అంటూ మరో వీడియోను 'ఇండియా టుడే' శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో ఏబీవీపీకి చెందిన మరో విద్యార్థిని కోమల్ శర్మ ఉన్నారని స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్నది. ఆమె జేఎన్‌యూలో చదువుతోన్నారని, ఏబీవీపీ కార్యకర్త అని వివరించింది. వీడియోలో మొహానికి మాస్క్ వేసుకున్న ఫోటోలు, చేతిలో కర్ర పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి. ఆడియో టేపులు కూడా ట్రోల్ అవడంతో.. కోమల్ శర్మ తన ఉనికిని తెలియజేయొద్దని సీనియర్లను వేడుకుంటున్న ఆడియోలు కూడా బహిర్గతమవుతోన్నాయి. అయితే ఆమె కోమల్ శర్మ అని జేఎన్‌యూలో సీనియర్ విద్యార్థి ఒకరు 'ఇండియా టుడే' రిపోర్టర్‌కు తెలియజేశారు.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications