వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమనాథ్ భారతికి రెండు రోజుల పోలీసు కస్టడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతికి ఢిల్లీలోని కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈమేరకు మంగళవారం తీర్పు చెప్పింది. గృహ హింస, హత్యా యత్నం కేసులో ఆరోపణలు రావడంతో ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిసున్నట్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

నిందితుడు సోమనాథ్ వద్ద నుంచి ఆయుధాన్ని, ఆయన భార్యకు సంబంధించిన నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈమేరకు సోమనాథ్‌ను ప్రశ్నించేందుకు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు తీర్పు వెల్లడించింది.

Delhi Police gets 2-day custody of Somnath Bharti

షీనా బోరా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మొదటి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ పేర్లను పేర్కొంది.

ప్రస్తుతం వారు ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మంగళవారం నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీపై ఎఫ్ఐఆర్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే, ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ఓటర్లకు తాయిలాలు ప్రకటించారు. దీంతో, ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆయన ఉచిత కానుకలను ప్రకటించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో, ఆయనపై కేసు నమోదైంది. భబువా జిల్లాలో సోమవారం సుశీల్ కుమార్ మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, లాప్ టాప్‌లు, చీరలు, కలర్ టీవీలు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించారు.

దీంతో, ఓటర్లను ప్రలోభపెట్టారంటూ సుశీల్ కుమార్ మోడీపై జిల్లా అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. కాగా, అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

English summary
A court here on Tuesday sent, to two days police custody, former minister Somnath Bharti, who was arrested in a domestic violence case registered by his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X