బెంగళూరుకు దినకరన్ మీడియేటర్: ఇక్కడే తేల్చేయాలని, శశికళతో !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వజూపారన్న కేసులో అరెస్టు అయిన మద్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ను విచారణ కోసం బెంగళూరు తీసుకు వస్తున్నారు.

టీటీవీ దినకరన్, ఆయన అనుచరులు బెంగళూరులో సుఖేష్ చంద్రశేఖర్ తో చర్చలు జరిపారని, ఎన్నికల సంఘంలోని ఓ అధికారి రూ. 50 కోట్ల లంచం ఇవ్వాలని అక్కడే భేరం కుదుర్చుకున్నారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలోనే సుఖేష్ చంద్రశేఖర్ ను బెంగళూరు తీసుకువచ్చి విచారణ చెయ్యాలని ఢిల్లీ పోలీసు అధికారులు నిర్ణయించారు.

డీల్ కుదిరింది బెంగళూరులో !

డీల్ కుదిరింది బెంగళూరులో !

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను చూడటానికి టీటీవీ దినకరన్ అనేక సార్లు బెంగళూరు వచ్చారు. అదే సమయంలో సుఖేష్ చంద్రశేఖర్ ను నగర శివార్లలో టీటీవీ దినకరన్ భేటీ అయ్యారని సమాచారం.

మరెవరైనా ఉన్నారా ?

మరెవరైనా ఉన్నారా ?

టీటీవీ దినకరన్, సుఖేష్ చంద్రశేఖర్ ల మద్య ఇంకా ఎవరైనా మద్యవర్తులు ఉన్నారా ? అని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేసే సమయంలో అతని దగ్గర రూ. 1.30 కోట్లు ఢిల్లీ పోలీసులకు చిక్కింది.

రూ. 10 కోట్లు ఎలా వచ్చాయి

రూ. 10 కోట్లు ఎలా వచ్చాయి

ఎన్నికల సంఘం అధికారి ఒకరికి లంచం ఇవ్వజూపారన్న కేసులో అరెస్టు అయిన సుఖేష్ చంద్రశేఖర్ కు రూ. 10 కోట్లు ముందుగానే ఇచ్చారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే సుఖేష్ చంద్రశేఖర్ కు ఆ డబ్బు ఎలా చేరింది ? అని ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఒక్క రోజు ముందే బెంగళూరుకు

ఒక్క రోజు ముందే బెంగళూరుకు

ఏప్రిల్ 22 (శనివారం) నేరుగా విచారణకు రావాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ కమిషనర్ సంజయ్ చెన్నై చేరుకుని ఆయనే స్వయంగా టీటీవీ దినకరన్ కు సమన్లు జారీ చేశారు. అయితే ఒక్క రోజు ముందుగానే టీటీవీ దినకరన్ మద్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ను బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చెయ్యడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

టీటీవీ కోసం వస్తున్నారా ?

టీటీవీ కోసం వస్తున్నారా ?

ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకాక ముందే టీటీవీ దినకరన్ బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నశశికళతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో ఢిల్లీ పోలీసులు సైతం బెంగళూరు బయలుదేరారు.

బెంగళూరులో కేసులు

బెంగళూరులో కేసులు

టీటీవీ దినకరన్ మద్యవర్తిగా భావిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మీద గతంలో బెంగళూరులో అనేక చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. తాను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు అఖిల్ గౌడ (జాగ్వార్ సినిమా హీరో) అంటూ పలువురిని మోసం చెయ్యడానికి ప్రయత్నించడంతో కేసులు నమోదు అయ్యాయి.

మొత్తం మీద సినిమానే

మొత్తం మీద సినిమానే

సుఖేష్ చంద్రశేఖర్ ను విచారించి పూర్తి వివరాలు సేకరించాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సిద్దం అయ్యారు. టీటీవీ దినకరన్ తో ఎప్పుడు ఎక్కడ కలిశారు ? భేరం ఎంతకు కుదిరింది ? నగదు ఏ రూపంలో ఇచ్చారు ? అనే పూర్తి వివరాలు సేకరించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi police have brought TTV Dinakaran's alleged middleman Sukesh Chandrasekhar to Bengaluru for investigation in the bribery case.
Please Wait while comments are loading...