ట్యాక్స్ టెర్రరిజానికి కేంద్రం ప్రోత్సాహం: 7 డిమాండ్లు: మిడిల్ క్లాస్ మేనిఫెస్టో

Arvind Kejriwal: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తం అయ్యాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

Delhi polls 2025 Kejriwal 7 demands to reduce tax terrorism and released a middle class manifesto

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఈ ఎన్నికల బరిలో దిగారు. కల్కాజీ నుంచి ఆతిషి పోటీలో ఉన్నారు. అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

తాజాగా అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకొచ్చారు. కేంద్ర బడ్జెట్ సమీపిస్తోన్న నేపథ్యంలో- పన్నుల అంశాన్ని ప్రస్తావించారు. బడ్జెట్‌కు సంబంధించిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. బడ్జెట్‌తో ముడిపడి ఉన్న వివిధ అంశాలతో రూపొందించిన ఏడు డిమాండ్లు ఇవి.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు.. ప్రత్యేకించి మధ్య తరగతి కుటుంబీకులు- ట్యాక్స్ టెర్రరిజం బారిన పడ్డారంటూ మండిపడ్డారు. ప్రాథమిక హక్కుగా పరిగణించే విద్య, వైద్యం సహా అన్నింటిపైనా పన్నులు వేస్తూ జనం నడ్డి విరుస్తోన్నారంటూ విమర్శించారు. వచ్చే బడ్జెట్‌లో పన్నులను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న మధ్య తరగతి ప్రజలు లెక్కలేనని పన్నులను చెల్లించాల్సి వస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. టీచర్లు, లాయర్లు, వేతన జీవులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు విపరీతంగా పన్నులను చెల్లిస్తోన్నారని, ఇది ట్యాక్స్ టెర్రరిజమని వ్యాఖ్యానించారు.

మొత్తం ఏడు డిమాండ్లు పెట్టారు. అవి-

1. విద్యపై ప్రతిపాదించే బడ్జెట్‌ మొత్తాన్ని రెండు నుండి 10 శాతానికి పెంచడం, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించడం.

2. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు సబ్సిడీలను ప్రకటించడం.

3. ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచండం, హెల్త్ ఇన్సూరెన్స్‌పై పన్నులను పూర్తిగా తొలగించడం.

4. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచండం.

5. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించండం.

6. సీనియర్ సిటిజన్ల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడం.

7. రైల్వే ప్రయాణ ఛార్జీల్లో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీని అందించండం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+