Delhi Polls: బీజేపీ రెండో మ్యానిఫెస్టో విడుదల-కేజీ టూ పీజీ విద్య ఫ్రీ..!

ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల మ్యానిఫెస్టోను సైతం మూడు విడతలుగా విడుదల చేస్తోంది. ఇందులో తొలి భాగాన్ని ఇప్పటికే విడుదల చేసిన కాషాయ పార్టీ.. ఇవాళ రెండో పార్ట్ ను విడుదల చేసింది. ఇందులో కేజీ నుంచి పీజీ వరకూ విద్యార్ధులకు ఉచిత విద్య అందిస్తామని వాగ్దానం చేసింది.

తమకు ఢిల్లీ ఓటర్లు అధికారమిస్తే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే వారి పిల్లల్లో అవసరం ఉన్న వారికి కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య సౌకర్యం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప్ పాత్ర పేరుతో విడుదల చేస్తున్న మ్యానిఫెస్టో హామీల్లో భాగంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు ఒక్కసారి 15 వేల రూపాయల సాయం అందిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఆయా పరీక్షలకు వెళ్లి రావడానికి అయ్యే ఛార్జీలు, అప్లికేషన్ ఫీజు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇస్తోంది.

Delhi Polls bjp releases second manifesto promised free education from KG to PG

గత వారం విడుదల చేసిన తొలి మ్యానిఫెస్టోలో మహిళలకు నెలవారీ రూ.2,500 సాయం, ప్రతి గర్భిణీ స్త్రీకి రూ.21,000 సాయం, గ్యాస్ సిలిండర్‌ పై రూ.500 రాయితీ, అలాగే రెండు పండగలకు రెండు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా ఇస్తామని బీజేపీ హామీలు ఇచ్చింది. అలాగే సీనియర్ సిటిజన్లకు రూ.2,500 పెన్షన్ ఇస్తామని కూడా ప్రకటించింది. వచ్చే నెల 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాల హామీలే కీలకంగా మారిపోయిన నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్ ఇద్దరూ దాదాపు ఇవే హామీలు ఇస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+