ఢిల్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా ఛాయ్ వాలా: మోడీనే స్పూర్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగి 19వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు ఓ ఛాయ్ వాలా. 59 ఏళ్ల వయసున్న బలరాం బారి ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో రోడ్డు పక్కన చిన్న టీ దుకాణాన్ని నడుపుతున్నాడు.
ఆయన మాట్లాడుతూ "నమ్మకమే నా పెట్టుబడి. నామినేషన్ దాఖలు చేయడానికి సైతం నా దగ్గర డబ్బులు లేవు. భార్య, బంధువులు నుంచి డబ్బులు తీసుకున్నా. నా దగ్గర కారు, సెల్ ఫోన్ లాంటి విలువైన వస్తువులు ఏమీ లేవు." అని అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో ఛాయ్ వాలా అంటూనే... ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఆయన ఈరోజు ప్రధానిగా ఎదిగారు. ఆయన ప్రధాని అవ్వగా నేను అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేనా అని చెప్పారు. ఆయనే నాకు స్పూర్తి అని చెప్పారు.

ఇప్పటి వరకు లోక్ సభ, మున్సిపల్ ఎన్నికల్లో 18 సార్లు పోటీ చేశాడు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇతర అభ్యర్ధలు మాదిరే బలరాం బారి కూడా ఎన్నికల ప్రచారంలో తన నియోజక వర్గంలో ప్రతి ఇంటికీ తిరిగారు.
తాను ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో తన టీ షాప్ వద్ద తన కూతురుని ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. బలరాం బారి నియోజక వర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఆల్కా లాంబా, బీజేపీ తరుపున సునీల్ కుమార్ గుప్తాలు ప్రత్యర్ధులుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications