Delhi riots: మూడు కోర్టుల్లో హైడ్రామా -విద్యార్థి నేతల విడుదలకు ఉత్తర్వులు -సుప్రీంకు ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు విద్యార్థి నేతల విడుదలపై మూడు కోర్టుల్లో హైడ్రామా నడిచింది. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం దేశద్రోహం కాబోదంటూ ఢిల్లీ హైకోర్టు.. నటాషా నర్వాల్‌, దేవాంగన కలితా (జేఎన్‌యూ), అసిఫ్‌ ఇక్బాల్‌ తన్హా (జామియా మిలియా ఇస్లామియా) లకు మంగళవారం బెయిల్ ఇవ్వగా, ట్రయల్ కోర్టు కొర్రీలతో హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదు. తమ విడుదల విషయంలో పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నారంటూ విద్యార్థి నేతలు మళ్ళీ హైకోర్టును ఆశ్రయిచండంతో ట్రయల్ కోర్టు దిగిరాక తప్పలేదు.

ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులైన నటాషా నర్వాల్‌, దేవాంగన కలితా, అసిఫ్‌ ఇక్బాల్‌ తన్హాల విడుదలపై ట్రయల్ కోర్టు జడ్జి రవీంద్ర బేడీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆ ముగ్గురినీ వెంటనే విడుదల చేయాలని తీహార్ జైలు అధికారులకు మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో ఆ ముగ్గురూ ఇంకాసేపట్లో విడుదల కానున్నారు. అంతకుముందు..

Delhi riots: Sessions Court orders release of student activists given bail 2 days ago

బెయిల్ పొంది 2 రోజులైనా తమ విడుదలకు ఆటంకాలొస్తున్నాయంటూ విద్యార్థి నేతలు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు జాప్యాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గర్హించింది. విద్యార్థుల్ని త్వరితగతిన విడుదల చేయాలని సూచించింది. మరోవైపు, నటాషా నర్వాల్‌, దేవాంగన కలితా, అసిఫ్‌ ఇక్బాల్‌ తన్హాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో మరో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.

ముగ్గురు విద్యార్థి నేతలు బెయిల్ పొందేందుకు అనర్హులని, ఢిల్లీ అల్లర్ల కేసుల్లో వారి రిమాండ్ తప్పనిసరని, హైకోర్టు కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని ఢిల్లీ పోలీసులు సుప్రీంను వేడుకున్నారు. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు త్వరలోనే పరిశీలించనుంది. మొత్తంగా ముగ్గురు విద్యార్థి నేతల విడుదల అంశంపై ట్రయల్(సెషన్స్) కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+