ఘోరపరాజయంపై బీజేపీ రియాక్షన్.. కాంగ్రెస్ చచ్చినందుకు సంతోషమన్న తివారీ.. విక్టరీ ట్వీట్‌పై కామెడీ

ఓటమిలోనూ విజయాన్ని వెతుక్కోమనే వ్యక్తిత్వ వికాస నిపుణుల సూచనను ఢిల్లీ బీజేపీ యధావిధిగా స్వీకరించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ మొత్తానికే అడ్రస్ గల్లంతు కావడం చాలా సంతోషకర పరిణామమని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. మంగళవారం ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా తీర్పును శిరసావహిస్తామని, ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. వివాదాస్పద విక్టరీ ట్వీట్ పై ఆయన ఇచ్చిన వివరణ అందరకీ నవ్వుతెప్పించింది.

అసలు పాయింట్ అదే..

అసలు పాయింట్ అదే..


ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి గత 5 ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఓటములే చవిచూసింది. 2015లో చిత్తుగా ఓడిన బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోగా.. ఈసారి కూడా అదే స్థాయిలో జస్ట్ 7 సీట్లు రాబట్టుకోగలిగింది. 2015లో ఆ పార్టీకి 32 శాతం ఓట్లురాగా, 2020లో మాత్రం 40 శాతానికిపైగా ఓట్లు పడ్డాయి. ఢిల్లీలో నాలుగు సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. 2015లోనూ మెజార్టీ స్థానాల్లో రెండో ప్లేసులో నిలిచింది. ఎనిమిది నెలల కిందట జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఆరుచోట్ల హస్తం గుర్తు అభ్యర్తులు రన్నరప్ గా నిలిచారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ్టి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కకపోగా, 60కిపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. మొత్తం ఎన్నికల ప్రక్రియలో అసలు పాయింట్ ఇదేనని ఢిల్లీ బీజేపీ చీఫ్ చెప్పారు.

బాధాకరమే కానీ..

బాధాకరమే కానీ..

‘‘ఇవాళ ఢిల్లీలో బీజేపీ, ఆప్ ల మధ్యే పోటీ జరిగింది. ఈ రెండు పార్టీలు తప్ప మిగతావాళ్లెవరూ ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫనిష్ అయిపోయింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. బీజేపీకి సంబంధించినంతవరకు ఓటమి బాధాకరమే అయినా ఓట్ల శాతం పెరగడం గమనార్హం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి ధన్యవాదాలు''అని మనోజ్ తివారీ అన్నారు.

కేజ్రీవాల్ చేస్తారనే ఆశ..

కేజ్రీవాల్ చేస్తారనే ఆశ..

మంచి మెజార్టీతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి కానున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నానని, ఢిల్లీ ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తారనే ఆశిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడంలో బీజేపీ ఫెయిలైందనే వాదన కరెక్ట్ కాదని, ప్రజలు ఆప్ వైపు మొగ్గుచూపారని ఆయన చెప్పారు.

విక్టరీ ట్వీట్ పై ఫుల్ కామెడీ..

విక్టరీ ట్వీట్ పై ఫుల్ కామెడీ..


ఢిల్లీలో మరోసారి ఆప్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పవుతాయని, బీజేపీ కనీసం 48 సీట్లు గెల్చుకుంటుందని, కావాలంటే ట్వీట్ ను భద్రంగా దాచుకోండంటూ మనోజ్ తివారీ చేసిన ట్వీట్ పై విలేకరులు వివరణ అడగ్గా.. ‘‘ఏ పార్టీ మాత్రం ఓటమిని ముందే అంగీకరిస్తుంది చెప్పండి..''అంటూ ఆయన నవ్వులు పూయించారు. అసలు ఫలితాలు వెలువడేదాకా విజయంపై ధీమాగా ఉండటం తప్పేమీకాదని, బీజేపీ 48 సీట్లు గెలుస్తుందన్న ట్వీట్ ను డిలిట్ చేయాల్సిన అవసరంలేదని తివారీ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+