సెక్స్‌ ట్రేడ్ కేసులో గీతా ఆరోరా అరెస్ట్: 3 ఏళ్ళుగా పోలీసుల ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సెక్స్ ట్రేడ్ కేసులో సోనూ పుంజూబన్ అలియాస్ గీతా అరోరాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గీతా ఆరోరాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పెద్ద ప్లాన్ వేశారు.గీతా ఆరోరా చేతిలో చిత్రహింసలు అనుభవించిన బాధితురాలి సాక్ష్యం ఆధారంగా మరోసారి ఆమెను అరెస్ట్ చేశారు.

భర్త సహయంతో నవవధువుపై గ్యాంగ్‌రేప్: వీడియో తీసి, ట్రిపుల్ తలాక్

ఢిల్లీ వేదికగా చేసుకొని అమ్మాయిల అక్రమ రవాణా, శారీరక వేధింపుల కేసులో గీతా ఆరోరా అలియాస్ సోను పుంజాబన్‌పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాలు చూపలేదంటూ ఢిల్లీ కోర్టు కేసును కొట్టేసింది.

షాక్: మరో డేరా బాబా, 40 మంది బాలికలకు విముక్తి,, లైంగిక దాడులు

అయితే గీతా ఆరోరా నుండి తప్పించుకొన్న ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రాలేదు. అయితే బాధితురాలు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చేలా పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. దీంతో బాధితురాలు ముందుకు వచ్చింది.

సెక్స్ ట్రేడ్ కేసులో గీతా ఆరోరా అరెస్ట్

సెక్స్ ట్రేడ్ కేసులో గీతా ఆరోరా అరెస్ట్

సెక్స్ ట్రేడ్ కేసులో గతంలో నిర్ధోషిగా బయటపడిన గీతా ఆరోరా అలియాస్ సోనూ పుంజాబన్‌ను ఢిల్లీ పోలీసలుు మరోసారి అరెస్ట్ చేశారు.అమ్మాయిల అక్రమ రవాణా, శారీరక వేధింపుల చట్టం కింద ఆమెపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతోనే నిందితురాలిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

బాధితురాలి సహయంతో పక్కా ప్లాన్

బాధితురాలి సహయంతో పక్కా ప్లాన్

సోనూ చేతిలో తీవ్రంగా ఇబ్బందులు పడిన ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.2014లో బాధితురాలు నజాఫ్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.2013లో తనను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి దించారని చెప్పింది. బాధితురాలి చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.అయితే కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు మాత్రం బాధితురాలు భయపడింది. అయితే సాక్ష్యం చెప్పేందుకు భయపడి పోలీసులను తప్పించుకొని తిరగసాగింది.

బాధితురాలి కోసం పోలీసుల వేట

బాధితురాలి కోసం పోలీసుల వేట

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు మాత్రం వెనుకడుగు వేసింది. అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బాధితురాలును వెతికే పనిలో పడ్డారు.అయితే ఆరు మాసాల తర్వాత బాధితురాలు ఆచూకీ దొరికింది. కోర్టులో సాక్ష్యం చెబితే సోనూ చంపేస్తోందని భయంతో తాను పారిపోయినట్టు బాధితురాలు చెప్పింది. ఆ సమయంలో కూడ బాధితురాలు భయంతో పోలీసుల నుండి తప్పించుకొంది.ఎట్టకేలకు బాధితురాలిని పోలీసులు ఆచూకీని కనిపెట్టారు. బాధితురాలికి ధైర్యం చెప్పారు.

12 మంది వేధించారని బాధితురాలు వెల్లడి

12 మంది వేధించారని బాధితురాలు వెల్లడి

సోనూ కాకుండా మరో 12 మంది తనను వేధించారని బాధితురాలు చెప్పింది.లక్నో, రోహ్‌తక్‌లలో తనతో వ్యభిచారం చేయించారని బాధితురాలు తెలిపారు.కనీసం అన్నం కూడ పెట్టకుండా ఇబ్బందిపెట్టేవారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విటులను ఆకర్షించేందుకు

విటులను ఆకర్షించేందుకు

విటులను ఆకర్షించేందుకు అందంగా తయారు కావడం ఇంగ్లీష్‌ మాట్లాడటం వంటి విషయాలను సోనూ నేర్పించిందని చెప్పారు. విటుల వద్దకు పంపే ముందు సోనూ తనకు డ్రగ్స్‌ ఎక్కించేదని వివరించారు.ఢిల్లీ నగరంలో గీతా స్థావరాలపై దాడులు చేస్తున్నట్టు డీసీపీ బీష్మ సింగ్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Yet again, the infamous high class pimp, Geeta Arora alias Sonu Punjaban, (36), is in police's net. This time, she has been booked under the Protection of Children from Sexual Offences Act.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి