వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్ .. ఢిల్లీ షట్ డౌన్.. 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ కానుంది. ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి 31వరకు సకలం బంద్ అని ప్రకటించింది ఢిల్లీ సర్కార్ . కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపిన ప్రకారం...ఢిల్లీలో ఇప్పటివరకు 27కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక కరోనా మరణం సంభవించగా,ఐదుగురు ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఈ నేపధ్యంలో స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించింది . వైరస వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ తమ తమ ఇళ్లకే పరిమితమవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలో చాలామంది ఉద్యోగులు, ప్రజల జీవనాలపై ఈ వైరస్ తన ప్రభావం చూపిస్తుంది . ఈ సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకుంటామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక ఈ నేపధ్యంలోనే దేశ రాజధానిలో 72లక్షలమంది ప్రజలకు ఉచిత రేషన్,పెన్షన్ లను రెట్టింపు చేస్తున్నట్లు ఆదివారం సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

 Delhi Shut Down .. Free Ration and Pension Double for 72 lakh people

అంతేకాకుండా ఉద్యోగస్తులందరికీ కంపెనీలు పెయిడ్ లీవ్ లు ఇవ్వాలని తాను అర్థిస్థున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఇక ఇళ్లల్లో పనిచేసే పనిమనుషులకు కూడా పెయిడ్ లీవ్ లు ఇవ్వాలని కోరుతున్నట్లు ఢిల్లీ సీఎం తెలిపారు. ఇది కేవలం జాలి సంజ్ణ కాదని, ఇది మన ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి సామర్థ్యమైనదని కూడా కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీవ్యాప్తంగా నైట్ షెల్టర్ల కోసం కొన్ని ప్రత్యేక గృహాలను ఎంపిక చేసి, అందులోకి వారికి భోజనం అందిస్తోంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లేస్ లలోకి వచ్చి భోజనం చేయవచ్చని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూడదని కేజ్రీవాల్ తెలిపారు.

English summary
The nation's capital, Delhi, has already been completely locked down. Delhi government announces Bandh till March 31 .The virus affects the lives of many employees and people in Delhi. CM Kejriwal has announced that he will help the people of Delhi. Against this backdrop, Kejriwal announced on Sunday that more than 72 lakh people in the nation's capital were doubling free ration and pension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X