వావ్.. ఢిల్లీ టీచర్ ఆదుర్స్.. విద్యార్థులతో కలిసి స్టెప్పులు.. నెటిజన్ల ఫిదా
టీచర్లు.. ఆదర్శంగా నిలుస్తారు కొందరు.. వారితో కలిసిపోతారు. ఆట, పాటల్లో సమానంగా ఉంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఓ టీచర్ విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేశారు. అలా ఇలా కాదు.. స్టూడెంట్స్‌తో కలిసి సమానంగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
క్లాస్ రూమ్‌లో డ్యాన్స్ సెషన్ సందర్భంగా వారు స్టెప్పులు వేశారు. కిస్మాత్‌లో గల కజ్రా మొహబ్బత్ వాలా పాటకు డ్యాన్స్ వేశారు. విద్యార్థులు ఒక్కొక్కరు రాగా.. తర్వాత మేడమ్ వస్తారు. ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తారు. మేడమ్ తర్వాత మరో ఇద్దరు కూడా వస్తారు. తర్వాత మేడమ్ వచ్చి.. మళ్లీ స్టెప్పులు వేస్తారు. వీడియోను మను గులాటి షేర్ చేశారు. ఢిల్లీ గవర్నమెంట్ టీచర్‌ని అని చెప్పేందుకు గర్వపడుతానని తెలిపారు.

వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గులాటీ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ వీడియో చాలా మందికి ఇన్‌స్పిరేషన్ కలిగిస్తోందని వివరించారు. ఈ సమాజానికి మీలాంటి టీచర్ ఒకరు కావాలని మరొకరు కామెంట్ చేశారు. విద్యార్థులకు ఎక్స్ ట్రా కరిక్యూలర్ యాక్టివిటిస్ ముఖ్యం అని తెలిపారు. మీకు మేమంతా గ్రాండ్ సెల్యూట్ చేస్తున్నామని వివరించారు.
టీచర్ గులాటీ మిగతా వారికి ప్రేరణ కలిగిస్తున్నారని తెలిపారు. విద్యార్థులతో టీచర్ చక్కగా కలిసిపోయారని చాలా మంది కామెంట్ చేశారు. వీడియో ఇప్పటికే 564 కే వ్యూస్ సాధించింది.












Click it and Unblock the Notifications