హోటల్లో యువతిపై 24గంటల పాటు 11మంది రేప్
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతి పైన 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దేశ రాజధానికి చెందిన 17 ఏళ్ల యువతిని రాజస్థాన్‌లోని ఓ హోటల్‌లో పదకొండు మంది లైంగిక దాడికి పాల్పడ్డారు.
తన పైన 24 గంటల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు జైపూర్‌కు చెందిన వారు. నలుగురిలో హోటల్ మేనేజర్ ఉన్నాడు.

బాధితురాలు మంగోల్ పురి ప్రాంతానికి చెందిన యువతి. ఆమెను రాకీ అనే వ్యక్తి, ఆయన భార్య ఉద్యోగం పేరుతో ఆగస్టు 30వ తేదీన జైపూర్ తీసుకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో ఉంచారు. ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.
ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లారు. అక్కడే పదకొండు మంది ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో హోటల్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. మరుసటి రోజు ఢిల్లీ వచ్చిన యువతి... పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications