హస్తినలో హై టెంపరేచర్ : మరో రెండురోజులు మాడు పగలాల్సిందే
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కూడా భానుడి భగ భగలు ఎక్కవయ్యాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో కాసేపటికి పెదవులు ఆరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరగడంతో .. ప్రజలు అల్లాడుతున్నారు. మరో రెండురోజుల్లో 45 డిగ్రీలు దాటుతుందనే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు.

మరో మూడురోజులు ..
మరో మూడురోజులు ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం నుంచి జూన్ 2 వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని వెల్లడించారు. మే 30న 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవుతుందని అంచనా వేశారు. ఉత్తర, నార్త్ వెస్ట్ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ఉంటాయని గుర్తుచేశాయి. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో పరిస్థితి ఇలానే ఉంటుందని పేర్కొన్నారు.

ఉరుములు లేవు .. మెరుపులు లేవు ...
ఉష్ణోగ్రతల ప్రభావంతో మరో వారం పరిస్థితి ఇలానే ఉంటుందని స్కైమెట్ పేర్కొంది. అలాగే ముందస్తు వర్షాకాలాన్ని అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇప్పటికీ నార్త్ వెస్ట్ ఢిల్లీలో పొడి వాతావరణం కొనసాగుతుందని చెప్పింది. సోమవారం ఢిల్లీలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా, కనిష్టంగా 25.4 డిగ్రీల ఉష్ణోగ్రత అని అధికారులు తెలిపారు. తేమ శాతం 16 నుంచి 62 శాతానికి పెరిగిందని .. దీంతో మంగళవారం అది 43 డిగ్రీలకు చేరుకోనుందని లెక్కగట్టారు. ఢిల్లీలో సాధారణంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డవుతుంది. అయితే ఈసారి టెంపరేచర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవీ కారణాలు ..
ఢిల్లీలో వెదజల్లే కాలుష్యంతో శీతకాలంలో చలి కూడా ఎక్కువే. ఆ కాలుష్యంతో ఈ సారి ఉష్ణతాపం కూడా పెరుగుతుంది. ఇదివరకు లేనంతగా టెంపరేచర్ పెరగడంతో హస్తినవాసులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గాలంటే .. కార్ల కోసం వినియోగంచే సరి, బేసి సంఖ్యలను తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఢిల్లీ పరిసరాల్లో వరి కోశాక .. పంట చేలు తగలబెట్టడంతో పొగ కాలుష్యం ఎక్కువవుతుంది. దానిని కూడా నివారిస్తే తప్ప ఢిల్లీ సుందర నగరంగా తిరిగి మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications