ఢిల్లీ క్యాబ్ రేప్: తర్వాత శివకుమార్ ఐఫోన్ ఆఫ్ చేశాడు

న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం చేసిన తర్వాత ఉబేర్ సంస్థ తనకు ఇచ్చిన ఫోన్‌ను స్విచ్ఫాఫ్ చేశాడు. కంపెనీకి దొరక్కుండా తప్పించుకునేందుకు అతను ఆ పనిచేసినట్లు తెలుస్తోంది. కంపెనీ శివకుమార్ యాదవ్‌కు ఇచ్చిన ఆ ఐఫోన్‌ను మథుర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ సంబంధిత సర్వీసులను అందిస్తూ ఐటి చట్టాలను ఉల్లంఘించిన ఉబేర్, ఇతర క్యాబ్ కంపెనీలపై కేసును ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఉబేర్ ఆసియా బిజినెస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్‌ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. మహిళల్లో ఆత్మరక్షణ శిక్షణను ప్రోత్సహించాలని, దాన్ని సిలబస్‌లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు. అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన కేసుల శాతం ఢిల్లీలో 36 ఉందని, జాతీయ సగటు 27 శాతం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Delhi Uber cab rape case: Police recover accused driver's iPhone'

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.

కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+