నా మీదే అరుస్తావా..?: బంధువులను పిలిపించి భ‌ర్త‌ను కొట్టి, గొంతు నులిమి చంపిన భార్య

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న గొడవ.. భర్త ప్రాణాలను తీసింది. క్షణికావేశంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. ఈ దాడిలో భర్త మృతి చెందగా.. భార్య జైలు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో ఆ చిన్న పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.

ఏం జరిగిందంటే..? దిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో వినయ్ గుప్తా, రేఖ దంపతులు కాపురం ఉంటున్నారు. మూడున్నరేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఈ జంటకు ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. వినయ్ అడోబ్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన వార్షిక ప్యాకేజీ రూ. 60 లక్షలుగా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వినయ్- రేఖల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో రేఖ తరఫు బంధువులు వినయ్ ను చంపేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తూ వచ్చారు. ఇక తాజాగా మరోసారి వినయ్- రేఖల మధ్య గొడవ జరిగింది. తమ పిల్లలకు మెడిసిన్ ఇచ్చే విషయంలో వినయ్, రేఖా మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన భర్త వినయ్ గుప్తా.. భార్య రేఖపై గట్టిగా అరిచాడు.

నా మీదే అరుస్తావా..? అంటూ భర్తపై కోపం పెంచుకున్న రేఖ అక్కడినుంచి వెళ్లిపోయింది. 10 నిమిషాల తర్వాత తన కుటుంబ సభ్యులను తీసుకొని అత్తారింటికి వచ్చింది. 'మా అక్కపై ఎలా అరుస్తావ్' అంటూ రేఖా సోదరులు (ఇద్దరు) వినయ్‌పై దాడి చేశారు. అనంతరం రేఖా తండ్రితో పాటు ఆమె మేనమామ సైతం వినయ్‌ని చుట్టుముట్టి ఎటాక్ చేశారు. వినయ్ కుటుంబ సభ్యులు అడ్డురాగా వారిని తోసేసి మరీ అతడ్ని దారుణంగా కొట్టి, గొంతు నులిమి.. గుండెపై తన్నారు.

Delhi Wife summons relatives following a minor dispute has husband beaten and strangled to death

ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వినయ్ ను కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రేఖతో కలిపి ఆమె కుటుంబానికి చెందిన మొత్తం 7 మందిపై కేసు నమోదు అయింది. సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి.. ప్రీ-ప్లాన్‌ తోనే తన కొడుకుని చంపారని తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+