యువతిని కార్లోకి లాగి వీధుల్లో తిప్పుతూ ముగ్గురు రేప్

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం జరిగింది. నగర నడి వీధుల్లో తిప్పుతూ కారులోనే ఓ యువతి పైన ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ముగ్గురూ నాంగాల్ దేవత్ ప్రాంతానికి చెందిన జితేందర్, జై భగవాన్, అజయ్‌లు.

తనపై ముగ్గురు యువకులు కదులుతున్న కారులో వసంత్ కుంజ్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారని 25 ఏళ్ల బాధితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురు దక్షిణ ఢిల్లీకి చెందిన నంగ్లా డేవాత్ ప్రాంతానికి చెందినవారు. వారి పైన వసంత్ కుంజ్ (దక్షిణ) పోలీసులు కేసు నమోదు చేశారు.

Delhi woman alleges gang-rape in moving car

వసంత్ కుంజ్ వీధుల్లో వారు కారును పదే పదే తిప్పుతూ అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఇంటికి దగ్గర్లో కారు నుండి తోసేసి వెళ్లిపోయారు.

నిందుతుల్లో ఒకడు బాధితురాలికి పరిచయం ఉన్న వ్యక్తి. ఆమె బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను వసంత్ కుంజ్ ప్రాంతంలో షాపింగ్ చేసేందుకు వెళ్తున్న సమయంలో ఎవరు లేని ప్రదేశంలో నిందితులు ముగ్గురు ఆమెను బలవంతంగా కారులోకి లాక్కున్నారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. అరిస్తే భయంకర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+