భర్తను చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చేసింది
న్యూఢిల్లీ: ఓ మహిళ తన పిల్లల ముందే భర్తను చంపేసి అతని శవాన్ని ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చేసింది. ఈ సంఘటన ఢిల్లీలోని నజఫ్‌ఘర్ ప్రాంతంలో జరిగింది. శవాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో వేసిన తర్వాత దాన్ని, దాని పరిసరాలను సిమెంట్‌తో మూసేయాలని కూలీలకు చెప్పింది.
ఆ సంఘటన ఆగస్టు 15వ తేదీ సాయంత్రం జరిగింది. శవం కుళ్లిపోయి దుర్వాసన రావడం ప్రారంభించింది. దీంతో గురువారం శవం బయటపడింది. ఈ హత్యకు ఆ మహిళ పిల్లలే సాక్షులు. ఆమె వారి నోళ్లు మూయించింది.

అయితే, ఆ తర్వాత తీవ్ర పశ్చాత్తాపానికి గురైన మహిళ నేరాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు. తనను తిట్టడం వల్ల భర్తతో విసిగిపోయానని ఆమె తొలుత పోలీసులకు చెప్పింది. రోజూ తాగి వచ్చి తనను బూతులు తిట్టేవాడని ఆమె చెప్పింది.
అతని వేధింపులకు తాళలేక చంపేశానని చెప్పింది. రాత్రి పూట భర్తను గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత రాత్రంత అతని శవం పక్కనే పడుకుంది.












Click it and Unblock the Notifications