"ఛావా" సినిమా చూసొచ్చి.. రోడ్లపై రెచ్చిపోయి.. ముస్లింల పేర్లు కనబడితే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఛావా పేరు మారుమోగుతోంది. నార్త్ నుంచి సౌత్​ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు 'ఛావా'గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ లీడ్​ రోల్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లు సాధించింది. అటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా రిలీజ్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. ఛావా సినిమా చూసి బయటకు వచ్చిన కొంతమంది యువత.. రోడ్డుపై రెచ్చిపోయారు. దిల్లీలో హుమాయున్ రోడ్డు, అక్బర్ రోడ్డు అని రాసి ఉన్న సైన్ బోర్డులను విరగగొట్టారు. అవి ముస్లిం రాజుల పేర్లుగా భావించి వాటిపై నళ్ల రంగుపోసి చెరిపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Delhi Youth Enthralled by Chhaava Movie Akbar Road Humayun Road Sign Boards Removed

కథ ఇదే..

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. స్టార్ డైరెక్టర్ లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో అక్షయ్‌ ఖన్నా మెరిశారు. శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించి మెప్పించారని నెటిజన్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+