ఆల్ఫా వంటి వేరియంట్ ల కంటే డెల్టా వేరియంట్ ఎక్కువ వేగంగా వ్యాప్తి ; స్టడీస్ చెప్తున్న కారణాలివే !!

ఇప్పుడు ప్రపంచం మొత్తం డెల్టా వేరియంట్ విషయంలో భయాందోళనకు గురవుతోంది. తాజాగా డెల్టా వేరియంట్ యొక్క ఉత్పరివర్తన డెల్టా ప్లస్ వేరియంట్ మరింత విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలో కోవిడ్ -19 యొక్క డెల్టా వేరియంట్ వ్యాప్తిపై జీవశాస్త్ర ప్రాతిపదికన అధ్యయనం జరుగుతోంది. అనేక కొత్త అధ్యయనాలు డెల్టా వేరియంట్లో జరిగిన కీలక ఉత్పరివర్తనలు వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని తగ్గించాయని, అంతేకాకుండా కరోనా మహమ్మారి ప్రారంభదశలో కరోనా రోగుల్లో అధికంగా తీవ్రతను చూపించాయని కనుగొన్నారు. వేగవంతమైన వ్యాప్తికి ఆజ్యం పోసే ప్రధాన కారణాలపై ప్రస్తుతం ఇంకా అధ్యయనం జరుగుతోంది.

టీకాల సామర్ధ్యాన్ని తగ్గిస్తున్న డెల్టా వేరియంట్

టీకాల సామర్ధ్యాన్ని తగ్గిస్తున్న డెల్టా వేరియంట్

ఇటీవలి ఎపిడెమియోలాజికల్ పరిశోధన ప్రకారం డెల్టా వేరియంట్ (B.1.617.2) 2020 చివరిలో యూకేలో మొదటిసారిగా గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే కనీసం 40 శాతం ఎక్కువ వ్యాప్తి చెందగల వైవిధ్యం. అంతేకాకుండా, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా సామర్థ్యం తగ్గినట్లు బహుళ అధ్యయనాలు సూచిస్తున్నాయి. టీకాలు వేసిన వ్యక్తులు కూడా మళ్లీమళ్లీ డెల్టా వేరియంట్ బారిన పడుతున్నట్లు గా గుర్తించారు. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, ఒక పత్రికా సమావేశంలో, ఇంతకుముందు గుర్తించిన అత్యంత ట్రాన్స్‌మిసిబుల్ వేరియంట్ డెల్టా అని చెప్పారు. మరియు ఇది చాలా దేశాలలో కోవిడ్ -19 ఆధిపత్య జాతిగా మారుతోందని పేర్కొన్నారు.

స్పైక్ ప్రోటీన్ యొక్క ఫ్యూరిన్ చీలిక ప్రదేశంలో మార్పు డెల్టా తీవ్రతకు కారణం

స్పైక్ ప్రోటీన్ యొక్క ఫ్యూరిన్ చీలిక ప్రదేశంలో మార్పు డెల్టా తీవ్రతకు కారణం

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) లో సర్క్యులేట్ చేయబడిన అంతర్గత ప్రదర్శన ప్రకారం, MERS, SARS, ఎబోలా, సాధారణ జలుబు, కాలానుగుణ ఫ్లూ మరియు మశూచికి కారణమయ్యే వైరస్‌ల కంటే డెల్టా వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది. డెల్టా వేరియంట్ యొక్క తీవ్రమైన ఇన్ఫెక్టివిటీ వెనుక కీలక అమైనో యాసిడ్ మ్యుటేషన్ ఉండవచ్చని ఇటీవలి పరిశోధన సూచిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ మెడికల్ బ్రాంచ్ వైరాలజిస్ట్ పీ-యోంగ్ షి నేతృత్వంలోని పరిశోధకుల బృందం SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌లోని ఒకే అమైనో ఆమ్లాన్ని మార్చే కీలక మ్యుటేషన్‌పై చేసిన అధ్యయనంలో ప్రోలిన్ అవశేషాలను అర్జినిన్‌గా మారుస్తుందని, స్పైక్ ప్రోటీన్ యొక్క ఫ్యూరిన్ చీలిక ప్రదేశంలో మార్పు జరుగుతుంది కాబట్టి తీవ్రత ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.

ఆల్ఫా కు డెల్టాకు మధ్య వ్యత్యాసం ఇదే

ఆల్ఫా కు డెల్టాకు మధ్య వ్యత్యాసం ఇదే

ఆల్ఫా వేరియంట్ కూడా అదే స్థానంలో మ్యుటేషన్‌ను కలిగి ఉంటుంది, అయితే ఇది వేరే అమైనో ఆమ్లంలో మార్పును కలిగి ఉంటుంది. డెల్టా విషయంలో, ఫ్యూరిన్ చీలికను మార్చే మ్యుటేషన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం పేర్కొంది. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన అధ్యయనం యొక్క ప్రీ-ప్రింట్‌లో, స్పైక్ ప్రోటీన్ ఆల్ఫా కంటే డెల్టా-వేరియంట్ కణాలలో మరింత సమర్ధవంతంగా కట్ చేయబడిందని, స్పైక్ సమర్ధవంతంగా క్లిప్ చేయబడటానికి P681R మ్యుటేషన్ ఎక్కువగా బాధ్యత వహిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

డెల్టా వేరియంట్‌లు ఆల్ఫా కంటే వేగంగా వ్యాప్తి

డెల్టా వేరియంట్‌లు ఆల్ఫా కంటే వేగంగా వ్యాప్తి

P681R మ్యుటేషన్ డెల్టా వేరియంట్ యొక్క అధిక అంటువ్యాధిని కలిగించే, వేగవంతమైన ప్రసారానికి కీలక మార్పులు కలిగి ఉందని అధ్యయనం పేర్కొంది. డెల్టా వేరియంట్‌లు ఆల్ఫా కంటే వేగంగా వ్యాప్తి చెందుతాయని పరిశోధకులు కనుగొన్నారు. టోక్యో విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ కీ సటో నేతృత్వంలోని బృందం నిర్వహించిన పరిశోధన ఫలితాలను ఈ అధ్యయనం ప్రతిధ్వనిస్తుంది. ఇది P681R ను కలిగి ఉన్న స్పైక్ ప్రోటీన్లు మ్యుటేషన్ కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా అంటుకోని కణాల ప్లాస్మా పొరలతో కలిసిపోతాయని కనుగొన్నారు.

 డెల్టాను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే చాలదు.. అలెర్ట్ అంటున్న నిపుణులు

డెల్టాను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే చాలదు.. అలెర్ట్ అంటున్న నిపుణులు

ఇంకా అనేక అధ్యయనాలు డెల్టా వేరియంట్ యొక్క వ్యాప్తిని, వేరియంట్ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలో మొదటి సారి వెలుగుచూసిన డెల్టా వేరియంట్, ప్రస్తుతం బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది . మనదేశంలో సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగడానికి డెల్టా వేరియంట్ కారణమని తెలుస్తుంది. డెల్టా రకాన్ని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే చెబుతున్న నేపథ్యంలో యాక్షన్ తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+