'పోర్న్'కు బానిసలు.. మాతోనూ లైంగికంగా గడపడం లేదు: భర్తలపై భార్యలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పోర్నోగ్రఫీ కాపురాల్లో చిచ్చు పెడుతోంది. తీరిక దొరికితే చాలు స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ బతికేస్తున్న భర్తలతో భార్యలు అష్టకష్టాలు పడుతున్నారు.

ఎదుగుతున్న పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయి.. ఇంట్లో ఉన్నంతసేపూ ఆ వీడియోల్లోనో మునిగి తేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'పోర్న్' వల్ల ఇల్లు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని.. ఇప్పటికైనా ఇండియాలో దాన్నినిషేధించాలని వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు..

పెరుగుతున్న బాధితులు:

పెరుగుతున్న బాధితులు:

తమ భర్తలు పోర్న్‌కు బానిసలయ్యారని బాధితులు కోర్టుకెక్కుతూనే ఉన్నారు. 2013లో పోర్నోగ్రఫీని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిల్(ప్రజా ప్రయోజన వ్యాజ్యం)లో వీరంతా భాగస్వాములు అవుతున్నారు. పోర్న్ లేకుండా చేస్తే గానీ తమ కాపురాలు నిలబడవని మొరపెట్టుకుంటున్నారు.

నాతోనూ లైంగికంగా గడపడం లేదు: ఓ బాధితురాలు

నాతోనూ లైంగికంగా గడపడం లేదు: ఓ బాధితురాలు

'పోర్న్‌ వీడియోలకు బానిసైన నా భర్త విడాకుల కోసం పట్టుబడుతున్నాడు. ఇందుకోసం రోజూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించాడు. అతనిలో లైంగిక శక్తి కూడా తగ్గిపోయింది.

నాతో లైంగికంగా గడపడానికి కూడా ఒప్పుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో అసహజ శృంగారానికి పాల్పడాలని నన్ను బలవంతపెడుతున్నాడు. అతడి తీవ్ర వికృతమైన ప్రవర్తనతో మా వైవాహిక జీవితం నాశనమయ్యే పరిస్థితి నెలకొంది.' అని ముంబైకి చెందిన ఓ మహిళ గతంలోనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

నన్ను పట్టించుకోవట్లేదు: మరో బాధితురాలు

నన్ను పట్టించుకోవట్లేదు: మరో బాధితురాలు

సుప్రీంలో దాఖలైన పిల్‌కు మహిళల నుంచి మద్దతు పెరుగుతోంది. పిల్‌లో తాము కూడా పార్టీగా చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన ఓ మహిళ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది.'నా భర్త పోర్న్‌ వీడియోలకు బానిసయ్యాడు.ఎప్పుడూ పోర్న్ వీడియోలు చూస్తూ.. నన్ను పట్టించుకోవడమే మానేశాడు. దీంతో మా వైవాహిక బంధం చిక్కుల్లో పడింది.' అని ఆమె పేర్కొంది.

పోర్న్ నిషేధం అసాధ్యమేనా?:

పోర్న్ నిషేధం అసాధ్యమేనా?:

దేశంలో 45కోట్ల మంది ప్రస్తుతం ఇంటర్నెట్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల రాకతో నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రపంచంలో చైనా తర్వాత ఇండియానే అత్యధిక నెట్ యూజర్స్ ను కలిగి ఉండటం విశేషం.

అయితే ఇంటర్నెట్ యూజర్స్ లో చాలామంది పోర్న్ ఎడిక్ట్ అవుతుండటం గమనార్హం.పోర్న్ సైట్స్ సర్వర్స్ చాలా మేరకు భారత్ బయటి దేశాల్లో ఉన్నవి కావడంతో.. వాటిని తొలగించడం అసాధ్యంగా మారింది.

అరికట్టే దిశగా సుప్రీం..:

అరికట్టే దిశగా సుప్రీం..:

పోర్న్‌ను పూర్తిగా నియంత్రించడం కష్టమే అయినప్పటికీ.. చైల్డ్‌ పోర్న్‌ బాలలపై లైంగిక దాడుల వీడియోలు, ఫొటోలను అరికట్టేందుకు మాత్రం ఇంటర్‌పోల్‌తో కలిసి చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ ప్రభుత్వం గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. అటు సుప్రీం సైతం పోర్న్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో పోర్న్‌ వీడియోలు వీక్షణపై నిషేధం విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pleading that the porn addiction had destroyed her matrimonial life, the Mumbai-based woman, who is also a social worker, filed a petition seeking direction to the Centre to take immediate steps to ban such obscene sites.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి