వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార కబంధ హస్తాల నుంచి విముక్తి : ఇది ప్రజాస్వామ్య విజయమన్న యడ్యూరప్ప

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : గత మూడు వారాల నుంచి సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక అసెంబ్లీలో ఎట్టకేలకు బలనిరూపణ జరిగింది. సంకీర్ణ ప్రభుత్వం 99 సభ్యుల మద్దతుతో మైనార్టీలో పడిపోయింది. మరోవైపు సభలో విపక్ష బీజేపీ 105 సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తమ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు ఆ పార్టీ నేతలు

బీజేపీ జయభేరీ ..
కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో బీజేపీ విజయం సాధించింది. 105 సభ్యుల ఓట్లతో సంకీర్ణ సర్కార్‌ను వెనక్కి నెట్టి అధికారానికి అడుగుదూరంలో నిలిచింది. స్పీకర్ నిర్వహించిన బలపరీక్షలో విజయం ప్రజాస్వామ్య విక్టరీగా అభివర్ణించారు యడ్యూరప్ప. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ కుమారస్వామి సర్కార్ కబంధ హస్తాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని హామీనిచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో నవశకానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు. అన్నదాతకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు.

democracy win in karnataka assembley says yadurappa

మరోవైపు బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన తమ పార్టీ .. 14 నెలల తర్వాత మెజార్టీ సాధించిందని చెప్తున్నారు. దీంతో ప్రజలకు తాము సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడే కాదు.. ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమమే బీజేపీకి ప్రయారిటీ అని స్పష్టంచేశారు.

English summary
BS Yeddyurappa says trust vote result is a victory of democracy. Speaking to reporters outside the Vidhana Soudha, BS Yeddyurappa said that they will soon stake claim to power. "People were fed up with Kumaraswamy government. I want to assure people of Karnataka that a new era of development will start now," he said. "We assure the farmers that we will give more importance to them in the coming days. We will take an appropriate decision at the soonest," he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X