మోడీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు: చైనాకు లాభం, నోట్ బ్యాన్, జీఎస్టీపై మన్మోహన్ ఫైర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu
Demonetisation led to increase in imports from China

అహ్మదాబాద్: పెద్ద నోట్లు రద్దు చేసి సంవత్సరం పూర్తి అయిన సందర్బంగా డిమానిటైజేషన్ పై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరో సారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెద్ద నోట్లు రద్దు చెయ్యడమే కేంద్ర ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు అని మన్మోహన్ సింగ్ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించాలని, లేదంటే సమాజంలో అసమానత పెరిగిపోతుందని మన్మోహన్ సింగ్ అన్నారు. తాను పార్లమెంట్ హాల్ లో చెప్పినట్లు పెద్దనోట్లు రద్దు అధికారిక, చట్టబద్దమైన దోపిడీగా ఉందని పునర్ఘాటించారు.

చిన్న వ్యాపారాలు !

చిన్న వ్యాపారాలు !

పెద్దనోట్ల రద్దు కారణంగా భారతదేశంలో చిన్న వ్యాపారాలు భారీగా దెబ్బ తిన్నాయని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. భారత దేశంలో పెద్దనోట్లు రద్దు అయిన తరువాత చైనా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా లబ్దిపొందిందని చెప్పారు.

 చైనాకు రూ. లక్షల కోట్లు లాభం

చైనాకు రూ. లక్షల కోట్లు లాభం

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో చైనా నుంచి దిగుమతులు భారీగా పెరిగిందని మన్మోహన్ సింగ్ అన్నారు. 2016-17 ప్రథమార్థంలో చైనా నుంచి భారత్ దిగుమతులు రూ. 1.96 లక్షల కోట్లు అని అన్నారు. 2017-18లో ఇది రూ. 2.14 లక్షల కోట్లకు పెరిగిందని మన్మోహన్ సింగ్ వివరించారు.

ఆర్థిక వృద్ది, ఉద్యోగాలు

ఆర్థిక వృద్ది, ఉద్యోగాలు

పెద్దనోట్లు రద్దు, జీఎస్టీపై మండిపడిన మన్మోహన్ సింగ్ వాటి కారణంగా ఆర్థిక వృద్ది, ఉద్యోగాలను హరించుకుపోయాయని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. గుజరాత్ లో డిసెంబర్ 9 నుంచి 14 తేదీ వరకు రెండు దశల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఆయన మాట్లాడారు.

 నోట్ బ్యాన్ ప్రభావం

నోట్ బ్యాన్ ప్రభావం

జీఎస్టీ అంకెలతో అనధికారిక ఆర్థిక వ్యవస్థ బాధలను కచ్చితంగా లెక్కించలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనధికారి ఆర్థిక వ్యవస్థపై డిమానిటైజేషన్ ప్రభావం అధికంగా ఉందని, ఉద్యోగాలు తీవ్రంగా కొల్పోయారని మన్మోహన్ సింగ్ చెప్పారు. గుజరాత్ లోనే జరిగిన ఉదాహరణలు మన్మోహన్ సింగ్ వివరించారు.

 గుజరాత్ లోనే చూద్దాం

గుజరాత్ లోనే చూద్దాం

సూరత్ తో పాటు ఇతర జిల్లాల్లో హ్యాండ్ లూమ్స్ లో ఉద్యోగాలు ఎక్కువగా కోల్పోయారని అన్నారు. సూరత్ తో పాటు అనేక జిల్లాల్లో హ్యాండ్ లూమ్స్ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. డిమానిటైజేషన్ ముందు జీడీపీ 7.4 శాతం ఉంటే పెద్దనోట్లు రద్దు తరువాత జీడీపీ 6.1 శాతనికి దిగజారిపోయిందని, పెద్దనోట్లు రద్దు అసమర్థ ప్రక్రియ అంటూ కేంద్ర ప్రభుత్వం మీద మన్మోహన్ సింగ్ మరో సారి మండిపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Speaking on the eve of the first anniversary of demonetisation, former Prime Minister Manmohan Singh said that the disastrous policy affected small businesses in India and benefited the Chinese economy as the imports showed a spike in the first half of FY18 over last fiscal.
Please Wait while comments are loading...