'మున్ముందు మరిన్ని షాకులు!, నోట్ల రద్దు ఆఖరి అస్త్రం కాదు'
నోట్ల రద్దును నల్లధనంపై ముఖాముఖి దాడిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ అభివర్ణించారు.
భువనేశ్వర్: దేశంలో నల్లకుబేరుల ఆగడాలకు చెక్ పెట్టడానికి.. మున్ముందు మరిన్ని షాకులు తప్పవని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అన్నారు. నల్లధనాన్ని అరికట్టడంలో నోట్ల రద్దు అనేది ఒక భాగం మాత్రమేనని, అవినీతిపై ఇదే ఆఖరు చర్య కాదని చెప్పారు.
నోట్ల రద్దును నల్లధనంపై ముఖాముఖి దాడిగా అరవింద్ పనగరియా అభివర్ణించారు. గురువారం భువనేశ్వర్‌లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన నల్లధనంపై స్థానిక మీడియాతో మాట్లాడారు. నల్లధనం పోగేసుకోకుండా అరికట్టడానికి పన్నురేట్లు తగ్గించడం, సరళీకరించడం వంటి చర్యలను కేంద్రం చేపడుతుందని ఈ సందర్బంగా ఆయన వివరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు మద్దతు పలుకుతున్నారని అరవింద్ పనగరియా తెలిపారు.












Click it and Unblock the Notifications