మోడీ దారిలోకి: నోట్ల రద్దుపై శివసేన యూ టర్న్
నోట్ల రద్దు విషయంలో శివసేన యూ టర్న్ తీసుకుంది. మంగళవారం సాయంత్రం శివసేన ఎంపీలు ప్రధాని మోడీని కలిశారు. నోట్ల రద్దు నిర్ణయం పారదర్శకంగా ఉందని, ఇదో చరిత్రాత్మక నిర్ణయమని ప్రశంసించారు.
ముంబై: నోట్ల రద్దు విషయంలో శివసేన యూ టర్న్ తీసుకుంది. నిన్నటి దాకా ఆ పార్టీ నోట్ల రద్దు పైన ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని దుమ్మెత్తి పోసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఢిల్లీలో ఆందోళన కూడా నిర్వహించింది. తాజాగా ఆ పార్టీ రివర్స్ గేర్ వేసింది.
మంగళవారం సాయంత్రం శివసేన ఎంపీలు ప్రధాని మోడీని కలిశారు. నోట్ల రద్దు నిర్ణయం పారదర్శకంగా ఉందని, ఇదో చరిత్రాత్మక నిర్ణయమని, దీనికి తమ పూర్తి మద్దతు ఉంటుందని శివసేన ప్రకటించింది.

సమావేశంపై శివసేన సీనియర్ నేత ఒకరు మాట్లాడారు. ఎంపీలు ప్రధానిని కలిశారని, తామంతా ఎన్డీఏతోనే ఉంటామని చెప్పామని వెల్లడించారు. నోట్ల రద్దుకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం వల్ల ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదన్నారు.
కాగా, నగదు మార్పిడి సహకార బ్యాంకుల్లో కూడా చేసుకునే విధంగా అనుమతించాలని రాజ్యసభ నేత సంజయ్ రౌత్ ప్రధాని మోడీని కోరారు. నోట్లరద్దు పరిస్థితిపై గత 13 రోజులకి సంబంధించిన సమాచారాన్ని రెండు పేజీల్లో ఆయన మోడీకి అందించారు. దీనిపై సంజయ్ రౌత్‌తో పాటు పలువురు సభ్యులు సంతకాలు చేశారు.












Click it and Unblock the Notifications