వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద స్కాం, ఘోర తప్పిదం: నోట్ల రద్దుపై ఏకేసిన చిదంబరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు భారతదేశంలోనే అతి పెద్ద స్కాం అని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఈ స్కాంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసిందన్నారు.
ఆయన మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిస్థాయిలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లేదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు విఫలప్రయోగమని ఆయన అన్నారు. నోట్ల రద్దు వెనక బిజెపి కుట్ర దాగివుందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు ముందే లీకైందని అన్నారు. పలువురి వద్ద పెద్ద ఎత్తులో రూ. 2వేల నోట్లు దొరకడంపై విచారణ జరిపించాలని చిదంబరం డిమాండ్ చేశారు. రూ.24వేలు కూడా సామాన్యులకు బ్యాంకుల్లో లభించడం లేదని అన్నారు.

చాలా మంది ప్రభుత్వ అధికారులు కొత్త నోట్లనే లంచాలుగా తీసుకుంటున్నారని, ఏపీలో ఓ ఇంజినీర్ కూడా కొత్త నోట్లనే లంచంగా తీసుకున్నాడని తెలిపారు. దొరికిన నోట్లపై విచారణ జరిపించాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది ఉగ్రవాదం, అవినీతి, నల్లధనం నిర్మూలనకు సరైన విధానం కాదని చిదంబరం అన్నారు.

పెద్ద నోట్ల రద్దుతో ధనికులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్రాన్ని ప్రజలు క్షమించరని, నోట్ల రద్దుకు ప్రజల మద్దతు లేదని అన్నారు. నోట్ల రద్దు అనంతరం జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిందని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ కంటే 143 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో నోట్ల రద్దుకు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు.

P Chidambaram

వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే ఎందుకని, ఇప్పుడు నోట్ల రద్దుపైనే మాట్లాడుకుందామని చిదంబరం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ఇటీవల తిరుమల వెళ్లానని, అక్కడ కూడా ఏ బ్యాంకులు, ఏటీఎంలు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు.

పెద్ద నోట్ల రద్దుతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో నగదు లేదని చెప్పారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, 15 నుంచి 20 కిలోమీటర్లు వెళ్తేగాని వారికి ఏటీఎంలు, బ్యాంకులు కానరావడం లేదని అన్నారు. రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.

బ్యాంకులు ప్రజలకు రూ. 24వేల నగదు కూడా ఇవ్వడం లేదని అన్నారు. విపత్తుల కంటే కూడా నోట్ల రద్దు ప్రజలపై పెను ప్రభావం చూపుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఏటీఎంలు లేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పారు.

మొత్తం 2లక్షల ఏటీఎంలలో 35వేల మాత్రమే పని చేస్తున్నాయని చిదంబరం తెలిపారు. క్రెడిట్ గ్రోత్ 20ఏళ్లకు పడిపోయిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దును మోడీ రహస్యంగా అమలు చేశారని, ఇతర మంత్రులతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి కూడా తెలియకుండా అమలు చేయాలా? అని ప్రశ్నించారు. అంతేగాక, మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను కూడా ఆయన సంప్రదించలేదని చెప్పారు.

పెద్ద నోట్ల రద్దుతో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ లావాదేవీలకు అనుకూలమేనని, కానీ, పూర్తి నగదు రహితంగా లావాదేవీలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. నగదు దొరక్క వ్యవసాయాధారిత మార్కెట్లు మూతపడిపోయాయని అన్నారు.

పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని పార్లమెంటులో మాట్లాడటం లేదని అన్నారు. ప్రధాని లేకుండా చర్చ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పార్లమెంటులో మాట్లాడకుండా బహిరంగ సభల్లో మోడీ మాట్లాడుతున్నారని చిదంబరం అన్నారు.

English summary
The Congress mounted its attack on demonetisation today with former Finance Minister P Chidambaram calling the banning of Rs 500 and Rs 1000 notes the biggest scam of 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X