ఆధార్ లేదని గెంటేశారు: ఆస్పత్రి వెలుపల ప్రసవించిన మహిళ

Posted By:
Subscribe to Oneindia Telugu

గుర్గావ్: ఆధార్ కార్డు తేలేదనే కారణంతో గర్భవతిని లేబర్ వార్డులో చేర్చుకోవడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దాంతో ఆమె గుర్గావ్ సివిల్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు వెలుపల ప్రసవించింది.

మహిళ కుటుంబ సభ్యులు ఆ విషయం చెప్పారు. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యుడిని, స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసినట్లు గుర్గావ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బికె రాజోరా చెప్పారు.

 లేబర్ వార్డుకు పంపించారు

లేబర్ వార్డుకు పంపించారు

లేబర్ పెయిన్స్ రావడంతో మున్ని కేవత్ (25) అనే మహిళను భర్త, తదితరులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. తాము ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నామని, క్యాజువాలిటీ వార్ుకు వెళ్లామని, లేబర్ వార్డుకు వెళ్లాలని డాక్టర్ సూచించారని మహిళ భర్త అరుణ్ కేవత్ చెప్పారు.

 ఆధార్ కార్డును ఇస్తేనే

ఆధార్ కార్డును ఇస్తేనే

తాము లేబర్ వార్డుకు వెళ్లామని, సిబ్బంది తన భార్య ఆధార్ కార్డు అడిగారని, కార్డు తీసుకురాలేదని, కార్డు నెంబర్ ఇస్తానని తాను చెప్పానని, ఆ తర్వాత ఆధార్ కార్డు కాపీ ఇస్తానని తాను చెప్పానని వివరించాడు. ఆధార్ కార్డు హార్డ్ కాపీ కావాలని లేడీ డాక్టర్, నర్సులు ఆధార్ కార్డు హార్డ్ కాపీ కావాలని పట్టుబట్టారని ఆయన అన్నాడు.

భర్త అందుకు వెళ్లాడు

భర్త అందుకు వెళ్లాడు

దాంతో తాను తన భార్య వద్ద బంధువులను ఉంచి, ఆధార్ కార్డు ప్రింటవుట్ తేవడానికి వెళ్లానని అరుణ్ కేవత్ చెప్పాడు. మహిళను కుటుంబ సభ్యులు తిరిగి క్యాజువాలిటీ వార్డుకు తీసుకుని వెళ్లారు. అక్కడికి కూడా రానీయలేదని కేవత్ బంధువు రామ్ సింగ్ చెప్పాడు.

 అక్కడి నుంచి గెంటేశారు

అక్కడి నుంచి గెంటేశారు

మున్నీతో పాటు తాను క్యాజువాలిటీ వార్డుకు వెళ్లానని, అక్కడ కూర్చోవడానికి కూడా వారు అనుమతించలేదని, తమను బయటకు తోసేశారని, అప్పటికే మున్నీకి విపరీతంగా నొప్పులు వస్తున్నాయని, ఎమర్జెన్సీ వార్డు గేటు బయట ఆమె ప్రసవించిందని రామ్ సింగ్ చెప్పాడు.

ఇతర రోగులు చిత్రించారు..

ఇతర రోగులు చిత్రించారు..

ఆ మొత్తం దశ్యాన్ని ఇతర రోగులు చిత్రించారు. అయినా సాయం చేయడానికి ఆస్పత్రి సిబ్బంది రాలేదు. శిశువును ప్రసవించిన తర్వాత వారు వచ్చారు. అక్కడ అంతా నెత్తురు పడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట మున్నీ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Denied entry into Gurugram hospital over Aadhaar, woman delivers baby outside

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి