వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహనదారులపై మోత బరువు: మళ్లీ పెట్రో రేట్లు భగ్గు: క్రూడాయిల్ ధర తగ్గినా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. రెండు రోజుల విరామం తరువాత.. చమురు సంస్థలు ఇంధన రేట్లను మళ్లీ పెంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన తరువాత కూడా.. భారత్‌లో వాటి రేట్లు కొండెక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తాజా పెంపు ప్రభావంతో అనేక పట్టణాల్లో వంద రూపాయల మార్క్‌ను దాటింది పెట్రోల్. డీజిల్ 90 రూపాయలను క్రాస్ చేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి కొన్ని చోట్ల 103.80 రూపాయలు పలుకుతోంది.

Bombay High Court: జగన్ సర్కార్‌కు బూస్ట్..ఆత్మరక్షణలో టీడీపీ: విద్యావ్యవస్థకు దేవుడే దిక్కుBombay High Court: జగన్ సర్కార్‌కు బూస్ట్..ఆత్మరక్షణలో టీడీపీ: విద్యావ్యవస్థకు దేవుడే దిక్కు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 29పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 19 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.93.04, డీజిల్ 83.80 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 99.32 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 91.01 పైసలకు చేరింది. ఇదే పెరుగుదల మున్ముందు కొనసాగితే ముంబైలో వంద రూపాయల మార్క్‌ను అందుకోవడానికి ఎన్ని రోజులో పట్టకపోవచ్చు.

despite a drop in global crude oil prices, Petrol, Diesel prices have been hiked again

చెన్నైలో పెట్రోల్ రూ. 94.71, డీజిల్‌ ధర రూ. 88.62, కోల్‌కతలో పెట్రోల్ రూ.93.11 పైసలు, డీజిల్‌ ధర రూ.86.64 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్-96.14, డీజిల్-88.84, పుణేలో లీటర్ పెట్రోల్-98.77, డీజిల్-88.96, పాట్నాలో పెట్రోల్-95.23, డీజిల్ 89.05, చండీగఢ్‌లో పెట్రోల్-89.31, డీజిల్-83.89, లక్నోలో పెట్రోల్-90.72, డీజిల్-84.18గా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్-101 మార్క్‌ను దాటుకుంది. వంద రూపాయల మార్క్ దాటడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో పెట్రోల్-96.50, డీజిల్-91.04, నొయిడాలో పెట్రోల్-90.66, డీజిల్-83.97, గుర్‌గావ్‌లో పెట్రోల్-90.73, డీజిల్-84.09గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ బ్యారెల్ ఒక్కింటికి 67.63 డాలర్లు పలికింది. 1.08 డాలర్ల మేర తగ్గింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్్ వద్ద కూడా క్రూడాయిల్ ఫ్యూచర్ ట్రేడింగ్‌లో క్షీణత నెలకొంది. 1.5 డాలర్ల మేర తగ్గి.. 64.44 వద్ద నిలిచింది. భారత్, తైవాన్, వియత్నాం, థాయ్‌లాండ్‌ వంటి ఆసియా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రతను నివారించడానికి లాక్‌డౌన్ తరహా పరిస్థితులు ఏర్పడటమే క్రూడాయిల్ ధరల తగ్గుదలకు కారణమైందని వందా ఇన్‌సైట్స్ ఎనర్జీ అనలిస్ట్ వందనా హరి తెలిపారు. అయినప్పటికీ- దేశీయంగా వాటి రేట్లు పెరగడం చర్చనీయాంశమౌతోంది.

English summary
Petrol and Diesel Rate Today in Delhi, Bangalore, Chennai, Mumbai, Hyderabad: Prices of Petrol and Diesel were left unchanged for the second day running today. So far this month, fuel prices have been increased 10 times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X