Yogi Adityanath:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంకు మిమ్మల్ని ఆహ్వానించేందుకే వచ్చా..!
రాయచూర్ : డబుల్ ఇంజిన్ సర్కార్‌తో కర్నాటకకు ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్.రాయచూర్‌లో బీజేపీ అభ్యర్థి శివరాజ్ పాటిల్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ బీజేపీ సర్కార్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిందో చెప్పుకొచ్చారు.
జాతీయ రహదారులు, విమానాశ్రయాలు,మౌళికాభివృద్ధితో పాటు ఇతర రంగాల్లో కూడా మంచి వృద్ధి నమోదు అయ్యిందంటే అందుకు కారణం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉండటమే అని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే రాయచూరులో కొత్త ఎయిర్పోర్టు, ఒక ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు వచ్చాయని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలో ఉండగా అభివృద్ధి గాడి తప్పిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేకత, అవినీతి,హింస అనే వ్యాధులతో బాధపడుతోందని ఆ పార్టీకి చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని యోగీ సెటైర్లు వేశారు. అందుకే బీజేపీ డాక్టర్ అయిన శివరాజ్ పాటిల్‌కు టికెట్ ఇచ్చిందని.. ఈయన డాక్టర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేస్తారని చెప్పుకొచ్చారు.
కరోనా సమయంలో ప్రధాని మోదీ ఎలా పనిచేశారో ప్రపంచ దేశాలు కొనియాడాయని సీఎం యోగీ గుర్తుచేశారు.ఆ సమయంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రధాని మోదీ పేదలకు 8 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, ఉచిత బియ్యం, హెల్త్ కిట్స్, 220 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చారని చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం పవిత్రమైనదని అక్కడ శ్రీరాముడు ఉంటే, కర్నాటకలో హనుమంతుడు ఉన్నాడని యోగీ చెప్పారు. రెండు రాష్ట్రాలను ఘనమైన చరిత్ర అనుసంధానం చేస్తోందని చెప్పారు.అయోధ్యలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రామాలయం నిర్మిస్తోందని ఆ ప్రారంభోత్సవానికి మీరంతా రావాలని తాను ఆహ్వానించేందుకు రాయచూర్ వచ్చినట్లు యోగీ చెప్పారు.












Click it and Unblock the Notifications