bihar assembly elections 2020 chief minister bihar devendra fadnavis test Coronavirus మహారాష్ట్ర మాజీ సీఎం కరోనా వైరస్
దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా: హోం ఐసోలేషన్‌లో బీహర్ బీజేపీ ఇంచార్జీ, టెస్ట్ చేసుకోవాలని..
బీహర్ ఎన్నికల వేళ కరోనా వైరస్ కలవరపెడుతోంది. నేతలకు వైరస్ సోకడంతో శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, బీహర్ బీజేపీ ఎన్నికల ఇంచార్జీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు.
ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారు టెస్ట్ చేసుకోవాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో కూడా తాను నిరంతరాయంగా పనిచేశానని.. కానీ ఇప్పుడు తనకు వైరస్ సోకిందని తెలిపారు. కానీ ఆ భగవంతుడు విశ్రాంతి తీసుకోవాలని బ్రేక్ ఇచ్చినట్టుంది అని పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో తనకు ట్రీట్‌మెంట్ జరుగుతోందని తెలియజేశారు.

తనను కలిసిన వారు పరీక్ష చేయించుకోవాలని.. ఎందుకైనా మంచిది హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. బీహర్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ఈ నెల 28వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. మూడు విడతల ఎన్నికల తర్వాత.. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. విజయం కోసం ప్రధాన పార్టీల అధినేతలు ఓటరు మహాశయులకు హామీల జల్లు కురిపిస్తున్నారు.