ఎయిర్‌పోర్టు రన్‌వేపై పందుల గుంపు హల్‌చల్!
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ నాగపూర్ విమానాశ్రయంలో ఒక్కసారిగా వచ్చిన పందుల గుంపు రన్ వేపై హల్‌చల్ చేశాయి. పటిష్టమైన రక్షణ కవచాన్ని ఛేదించుకుని కొన్ని పందులు రన్ వేపైకి వచ్చి, విమానాశ్రయ సిబ్బందికి చెమటలు పట్టించాయి.
సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కావడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది.

రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాగపూర్‌కు వచ్చారు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న జంబో బోయింగ్ 737 విమానం నాగపూర్ విమానంలో కిందకు దిగి టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళుతుండగా రన్ వేపై హఠాత్తుగా 8 పందులు గంపుగా వచ్చాయి.
వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది ఉరుకులు పెట్టి పందుల గుంపును రన్ వే నుంచి వెళ్లగొట్టారు. ఎయిర్ పోర్టులోకి పందుల చొరబాటును సీరియస్‌గా పరిగణించి డీజీసీఏ విచారణ ప్రారంభించింది. దర్యాప్తు అనంతరం బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications