డీజీసీఏ జరిమానాతో దిగివచ్చిన ఇండిగో.. బోర్డు కీలక ప్రకటన
గతేడాది డిసెంబర్‌లో విమాన సర్వీసుల రద్దు, జాప్యంతో లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన, నిర్వహణ లోపాలను గుర్తించిన డీజీసీఏ, ఇండిగోకు రూ. 22.20 కోట్ల భారీ జరిమానా విధించింది.
లక్షలాది మంది ప్రయాణికుల అవస్థలు
2025 డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య ఇండిగో సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 2,507 విమానాలు రద్దయ్యాయి. మరో 1,852 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విచారణలో తేలిన షాకింగ్ నిజాలు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డీజీసీఏ నలుగురు సభ్యులతో కూడిన కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో ఇండిగో వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అతి విశ్వాసంతో ఆపరేషన్లను సామర్థ్యానికి మించి ప్లాన్ చేయడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తినట్లు తెలిసింది. విమానయాన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లు బలహీనంగా ఉన్నట్లు కూడా తేలింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో మేనేజ్‌మెంట్ విఫలమైనట్లు కూడా తెలిసింది. .రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినట్లు కూడా తేలింది.
దిగివచ్చిన ఇండిగో.. బోర్డు కీలక ప్రకటన
డీజీసీఏ ఆదేశాల నేపథ్యంలో ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శనివారం (జనవరి 17, 2026) ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 2025లో భారీ స్థాయిలో విమాన రాకపోకలు నిలిచిపోవడంపై డీజీసీఏ విచారణ జరిపి తగిన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటామని, తగిన చర్యలను ఆలోచనాత్మకంగా, నిర్ణీత సమయంలోగా చేపడతామని ఇండిగో మేనేజ్‌మెంట్ తమ వాటాదారులకు, ముఖ్యంగా ప్రయాణికులకు హామీ ఇచ్చింది. గత 19 ఏళ్లుగా అత్యుత్తమ సేవలందించిన రికార్డు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అంతరాయంపై సంస్థ ఆత్మపరిశీలన చేసుకుంటోంది.ఎయిర్‌లైన్ అంతర్గత ప్రక్రియల పటుత్వాన్ని, స్థితిస్థాపకతను మరింత మెరుగుపరిచేందుకు ఇప్పటికే లోతైన సమీక్ష ప్రారంభమైందని ఇండిగో ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఈ సంక్షోభం నుండి సంస్థ మరింత బలంగా బయటకు వస్తుందని ఇండిగో బోర్డు ధీమా వ్యక్తం చేసింది.

2030 లక్ష్యం వైపు అడుగులు
భారతదేశ విమానయాన అవసరాలను తీర్చడంలో ఇండిగో ఎప్పుడూ ముందుంటుందని సంస్థ పేర్కొంది."భారత ప్రజలకు సేవ చేయడంలో మేము కట్టుబడి ఉన్నాము. 2030 నాటికి మన దేశం ప్రపంచ విమానయాన రంగంలో అగ్రగామిగా ఎదగడంలో మా వంతు వినమ్రమైన పాత్రను పోషిస్తాము." అని బోర్డు ప్రతినిధులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications