DGCA: అజిత్ పవార్ ఫ్లైట్ కాక్ పిట్ లో చివరి మాటలివే..బయటపెట్టిన డీజీసీఏ..!
నిన్న మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను, ప్రమాదానికి ముందు చివరి నిమిషాల్లో ఏం జరిగిందో కేంద్రం ఇప్పటికే బయటపెట్టింది. అయితే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ (DGCA) తాజాగా మరికొన్ని విషయాల్ని వెల్లడించింది. ఇందులో విమాన ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు కాక్ పిట్ లో చివరి మాటలు ఉన్నాయి.
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడ దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంది. దీంతో ఏటీసీ సాయంతో విమానం ల్యాండింగ్ కు పైలట్లు ప్రయత్నించారు. ఈ సమయంలోనే పొగమంచు పరిస్ధితుల్లో విమానం ల్యాండ్ కావాలా వద్దా అనే నిర్ణయాన్ని పైలట్లకే ఏటీసీ వదిలేసింది. దీంతో పైలట్లు కాసేపు విమానాన్ని చక్కర్లు కొట్టించిన తర్వాత ఫర్వాలేదనుకుని కిందకు దిగే ప్రయత్నం చేసే సమయంలో పరిస్ధితి తలకిందులైంది. దీంతో విమానం కుప్పకూలడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు.

సరిగ్గా ఈ సమయంలోనే కాక్ పిట్ లో వినిపించిన సంభాషణను ఫ్లైట్ రికార్డర్ గా చెప్పే బ్లాక్ బాక్స్ లో పైలట్ల మాటలు రికార్డ్ అయ్యాయి. ఇందులో వీరు విమానాన్ని ల్యాండింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కిందకు దింపుతున్న సమయంలో ఒక్కసారిగా పరిస్ధితి మారిపోవడంతో ఓ షిట్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇక చావు తప్పదని తేలిపోవడంతో వారు ఆ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రికార్డర్ లో నమోదైన సంభాషణ ఇది మాత్రమేనని తెలుస్తోంది. అంటే అంతకు ముందు పరిస్ధితి బాగానే ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications