ఢాకా ఉగ్రదాడి: భారత్ అమ్మాయిని చంపేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో భారత్‌కు చెందిన అమ్మాయి చనిపోయింది. హోలీ ఆర్టిసాన్ బేకరీపై ఉగ్రవాదులు జరిగినప దాడిలో భారత యువతి తరుషి జైన్ మరణించినట్లు భారత దౌత్య కార్యాలయం నిర్ధారించింది.

బేకరీలో పలువురిని బంధించిన ఉగ్రవాదులు తరుషిని కూడా గొంతుకోసం చంపేశారు. మొత్తం 20 మందిని ఉగ్రవాదులు చంపేశారు. వారిలో తరుషి కూడా ఉంది. తరుషి మృతిని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. ఆమె మృతి ఎంతో బాధిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

తరుషి తండ్రి సంజీవ్ జైన్‌తో తాను మాట్లాడానని, ఆమె మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేశానని సుష్మ చెప్పారు. ఈ కష్టకాలంలో సంజీవ్ జైన్ కుటుంబానికి దేశం యావత్తు బాసటగా నిలుస్తుందని ఆమె చెప్పారు. సంజీవ్ జైన్ కుటుంబానికి వీసా ఏర్పాటు చేస్తామని, ఆ పని మీదే తమ శాఖ అధికారులు ఉన్నారని సుష్మ ట్వీట్ చేశారు.

Tarishi


19 ఏళ్ల తరుషి బేర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థిని. తరుషి తండ్రి సంజీవ్ జైన్ ఢాకాలో నివసిస్తున్నాడు. దీంతో తరుషి సెలవులకు ఇక్కడికి వచ్చింది. ఉగ్రవాదుల దాడిని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దేశం పోరాటం చేస్తుందని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలంతా పవిత్రమైన రంజాన్‌ను నిర్వహించుకుంటుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. రంజాన్ సందర్భంగా ఇతర మానవులను చంపిన వారు ఏ విధమైన ముస్లింలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Embassy in Dhaka has confirmed the death of one Indian national who was killed in Friday's terror attack at the Holey Artisan bakery.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి