పెట్రోల్ ధరల రోజూవారీ సమీక్ష కొనసాగుతోంది:మంత్రి

పెట్రోల్‌, డీజిల్‌పై రోజువారీ ధరల సమీక్ష విధానం కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు.

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై రోజువారీ ధరల సమీక్ష విధానం కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారుల లబ్ధి దృష్ట్యా ఈ విధానంలో మార్పు చేసే అవసరం లేదని వ్యాఖ్యానించారు.

రోజువారీ ధరల విధానం బాగుందని ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. జూన్‌ 16 తర్వాత తొలిసారి ధరలు తగ్గుముఖం పట్టాయని, ఆ తర్వాత అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల వాటి ధరలు క్రమంగా పెరిగాయన్నారు.

Dharmendra Pradhan says daily petrol, diesel price revision to continue

ఒకవేళ అంతర్జాతీయంగా రేట్లు తగ్గితే వాటి ప్రయోజనాలు వెంటనే వినియోగదారులకు బదిలీ అవుతాయని పేర్కొన్నారు. అందుకోసం 15 రోజుల పాటు నిరీక్షించాల్సిన అవసరం లేదన్నారు.

గతంలో 15 రోజులకోసారి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరించేవి. జూన్‌ 16 తర్వాత రోజువారీ ధరల విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాటి ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి. ఇప్పటివరకూ పెట్రోల్‌పై రూ.6.6, డీజిల్‌పై రూ.4.02 వరకు ధర పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల హోండెలివరీ అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+