అయోధ్య ఆలయం మీద పచ్చ జెండాల ఫోటో ఎడిటింగ్, రాత్రి ఈద్గా మైదానంలోకి హిందువులు ఎంట్రీ
అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించడంతో దేశం మొత్తం పండుగ చేసుకుంది, గత సోమవారం అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్బంగా దేశ విదేశాల్లోని హిందువులు సంబరాలు చేసుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని హిందువులు అందరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఓ వర్గంలోని కొందరికి మాత్రం అయోధ్య రామ మందిరం ప్రారంభం అయిన రోజు బ్లాక్ డేగా మారిపోయింది.
అయోధ్య రామమందిరంపై పచ్చజెండాలు ఎగురవేసినట్లు ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిన కేసులో నిందితుడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. సద్దామ్ హుస్సేన్ అరెస్టు అయిన నిందితుడు. నిందితుడు సద్దామ్ హుస్సేన్ కర్ణాటకలోని ధారవాడ తాలూకా తడకోడ గ్రామానికి చెందినవాడు. అయోధ్య రామమందిరంపై పచ్చజెండాలు ఉన్నట్లు ఎడిట్ చేసిన ఫోటోను స్టేటస్ లో పెట్టిన సద్దామ్ హుస్సేన్ హిందువుల ఆగ్రహానికి కారణమైంది.

దీంతో వందలాది మంది హిందువులు రాత్రి ధారవాడ సమీపంలోని ఈద్గా మైదానంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఈద్గా మైదానంలోని గోపురాలను కూల్చివేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఈద్గామైదానంలోని ఓ గోపురం దెబ్బతిన్నది. పరిస్థితి విషమిచండంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు.
కర్ణాటక నార్త్ జోన్ ఐజీపీ వికాస్ కుమార్ సంఘటనా స్థలానికి పరుగుతీసి స్థానిక ముస్లిం నాయకులతో చర్చలు జరిపారు. ఈద్గా మైదానంలో దెబ్బతిన్న ఓ గోపురానికి వెంటనే మరమ్మతులు చేశారు. నార్త్ జోన్ ఐజీపీ వికాస్ కుమార్ ధారవాడ ఎస్పీ డాక్టర్ గోపాల్ బాకోడ్ ఇరు వర్గాల మత పెద్దలతో చర్చలు జరిపి శాంతియుతంగా ఉండాలని మనవి చేశారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయిన తరువాత అయోధ్య శ్రీరాముడి మందిరం మీద పచ్చ జెండాలు కట్టినట్లు ఫోటోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని నమోదు అయిన వేర్వేరు కేసుల్లో కర్ణాటకలోనే ఇప్పటి వరకు ఇద్దరు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ఇలాగే అయోధ్య రామ మందిరం మీద పచ్చ జెండాలు ఉన్నట్లు ఫోటోలు ఎడిట్ చేసిన గదగ్ జిల్లా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు అదే కర్ణాటకలోని ధారవాడకు చెందిన మరో వ్యక్తి అరెస్టు అయ్యాడు.












Click it and Unblock the Notifications