గాయపడ్డ గుండెతో గ్రౌండ్‌లోకి.. కన్నీళ్లు దిగమింగి మినాబ్ 168

ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పండగ (FIFA World Cup 2026) ఉత్సాహాన్ని నింపుతుంటే.. ఇరాన్ దేశం మాత్రం ఒక తీరని గుండెకోతతో, కన్నీటి జ్ఞాపకాలతో మైదానంలోకి అడుగుపెట్టింది. గత ఫిబ్రవరి (2026)లో ఇరాన్‌లోని 'మినాబ్’ పట్టణంలో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన ఘోర క్షిపణి దాడిలో 170 మందికి పైగా అమాయక పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఆ చిన్నారుల పవిత్ర జ్ఞాపకార్థం, వారి త్యాగాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తమ టోర్నమెంట్‌కు ఒక ప్రత్యేక రూపాన్ని ఇచ్చింది.

ఈ ప్రపంచకప్‌లో ఇరాన్ జట్టు "మినాబ్ 168" (Minab 168) అనే పేరుతో బరిలోకి దిగింది. అంతేకాదు, తమ గుండెల్లో దాగున్న ఆవేదనకు ప్రతీకగా ఆటగాళ్లంతా తమ యూనిఫామ్‌లపై ప్రత్యేక 'బంగారు పిన్నులను' ధరించి మైదానంలో భావోద్వేగభరితంగా నిలిచారు. ఈ ఉద్వేగభరిత ప్రస్థానంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ 'X' (ట్విట్టర్) వేదికగా ఒక గుండెలు పిండేసే లెగో-ప్రేరేపిత (Lego-inspired) వీడియోను పంచుకున్నారు.

Iran Football Team Honors 170 Slain Minab School Children In Emotional FIFA World Cup 2026 Campaign

"ఇరాన్ తన ఒంటిపై ఉన్న అన్ని గాయాలతోనూ ఇంకా గర్వంగా నిలబడే ఉంది. విశాలమైన ఛాతీ, అచంచలమైన సంకల్పంతో ఈ దేశ బిడ్డలు ప్రపంచ వేదికపై పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఒక దేశం మొత్తం చేస్తున్న ప్రార్థనలు మన జాతీయ జట్టుకు తోడుగా ఉన్నాయి. ఆ చిన్నారుల కోసం, మన ఇరాన్ కోసం, మన జాతీయ జెండా రెపరెపలాడటం కోసం మనమంతా ఏకతాటిపై నిలిచి 'ఇరాన్' అని నినదిద్దాం. మన యువతకు విజయం, గౌరవం దక్కాలని కోరుకుందాం" అంటూ ఆయన రాసుకొచ్చిన సందేశం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మరణించిన ఆత్మల త్యాగాల పునాదులపైనే ఇరాన్ పట్టుదల నిర్మితమైందని ఆయన పేర్కొన్నారు.

అక్షరాలపై మృత్యు తాండవం, 115 పసి ప్రాణాలు బలి!
అక్షరాలపై మృత్యు తాండవం, 115 పసి ప్రాణాలు బలి!

స్టేడియం వెలుపల నిరసనల హోరు.. మైదానంలో ఆటగాళ్ల పోరాటం

జూన్ 15 (సోమవారం) నాడు లాస్ ఏంజిల్స్‌లోని ప్రసిద్ధ 'సోఫి (SoFi) స్టేడియం'లో న్యూజిలాండ్‌తో జరిగిన ఇరాన్ తొలి మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. స్టేడియం లోపల ఇరాన్ మద్దతుదారులు ఫిఫా (FIFA) ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విప్లవానికి పూర్వపు ఇరాన్ జెండాలను ప్రదర్శించారు. మరోవైపు, మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియం వెలుపల వందలాది మంది ప్రదర్శనకారులు చేరి ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. స్టేడియం లోపల ఇంకొందరు ఇరాన్ ప్రేక్షకులు 1979 నాటి విప్లవానికి పూర్వపు పాత జాతీయ జెండాలను ప్రదర్శించడం అక్కడ తీవ్ర కలకలం రేపింది. ఇన్ని మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమను కనబరిచారు. రెండుసార్లు వెనుకబడినప్పటికీ.. పట్టుదలతో ఆడి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించి తమ పోరాట స్ఫూర్తిని చాటుకున్నారు.

160 మంది బాలికలను ఒకే చోట సమాధి
160 మంది బాలికలను ఒకే చోట సమాధి

"అది సైనిక స్థావరం కాదు.. బడి పిల్లల శ్మశానం" - అమెరికాపై ఇరాన్ ఆగ్రహం

ఇదిలావుండగా, ఈ ఘోర దురంతంపై అంతర్జాతీయంగా రాజకీయం ముదిరింది. ఫిబ్రవరిలో తాము దాడి చేసిన ఇరాన్ పాఠశాల ఒక మిస్సైల్ లాంచ్ ఫెసిలిటీ (క్షిపణి ప్రయోగ కేంద్రం) లో భాగమంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన ప్రకటనను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇదొక "సిగ్గులేని అబద్ధం" అని, తాము చేసిన ఘోర పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికే అమెరికా ఈ రకమైన కట్టుకథలు అల్లుతోందని ఇరాన్ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ ధ్వజమెత్తారు. "170 మందికి పైగా పాఠశాల పిల్లలను, వారి గురువులను క్రూరంగా ఊచకోత కోసిన నగ్న సత్యాన్ని దాచడానికి అమెరికా చేస్తున్న నీచమైన ప్రయత్నం ఇది" అని ఆయన మండిపడ్డారు. ప్రపంచకప్ వేదికగా ఇరాన్ ఆటగాళ్లు ప్రదర్శిస్తున్న ఈ నిశ్శబ్ద నిరసన, కన్నీటి నివాళి ఇప్పుడు ప్రపంచ క్రీడాభిమానుల హృదయాలను కదిలిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+