ఎట్టకేలకు మొహుల్ చోక్సీ అరెస్ట్ - సినీ ఫక్కీలో..!!
వేల కోట్ల మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వజ్రాల వ్యాపారం పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు కు మొహుల్ చోక్సీ వేల కోట్లు ఎగవేత కేసు లో కొన్నేళ్లుగా అరెస్ట్ కు ప్రయత్నాలు సాగుతున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న మొహుల్ చోక్సీ అరెస్ట్ విదేశాల్లో ఆశ్రయం పొందారు. విచారణ సంస్థలు ఆయన్ను భారత్ కు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసాయి. కాగా, తాజాగా భారత్ అభ్యర్ధన మేరకు బెల్జియం లో మొహుల్ చోక్సీ అరెస్ట్ చేసారు. భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ. 13వేల కోట్లు మోసం చేసి భారతదేశాన్ని విడిచిపెట్టి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీను రప్పించడానికి విచారణ సంస్థలు అనేక ప్రయత్నాలు చేసాయి. అయితే, విచారణ సంస్థల అడుగులను పసి గడుతూ విదేశాల్లోనే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చోక్సీ తప్పించుకునే ప్రయత్నం చేసారు. అంటిగ్వా మరియు బార్బుడాలోనే పట్టుకునే ప్రయత్నం చేసినా చిక్కకుండా పారిపోయారు. పంజాబ్ నేషన ల్ బ్యాంకుతో పాటుగా పలు బ్యాంకులకు టోకరా పెట్టినట్లు చోక్సీ పైన ఆరోపణలు ఉన్నాయి. రాజ కీయంగానూ చోక్సీని పట్టుకోకపోవటం పైన పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఆరోపణలు వచ్చాయి. కాగా, ఇప్పుడు ప్రయత్నాలు ఫలించాయి. బెల్జియం లో అరెస్ట్ చేసారు.

2018లో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే మెహుల్ చోక్సీ, అతని మేనల్లుడు, ప్రముఖ ఆభరణాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ భారత్ నుంచి పరారైన విషయం తెలిసిందే. మెహుల్ ఆంటిగ్వా పౌరసత్వం తీసుకోగా.. నీరవ్ మోదీ లండన్‌కు పారిపోయాడు. ప్రస్తుతం వారిని దేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రూ.13,500 కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ కు తీసుకొచ్చిన తరువాత విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications