ఐఎన్ఎస్ విరాట్‌లో రాజీవ్‌గాంధీ విహారయాత్ర చేయలేదు.. నేవీ స్పష్టీకరణ
బెంగళూరు : ఐఎన్ఎస్ విరాట్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విహార యాత్రకు వెళ్లారా అనే అంశంపై ఇండియన్ నేవీ స్పందించింది. ఈ అంశంపై ఓ పత్రిక సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడంతో ఈ మేరకు రిప్లే ఇచ్చింది. తన వ్యక్తిగత అవసరాల కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ గాంధీ ఉపయోగించలేరని స్పష్టంచేసింది. అయితే యుద్ధ నౌక వెళ్లే మార్గంలో మాత్రం రాజీవ్‌తోపాటు సోనియా కూడా పయనించారని పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు చేశారు. ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను తన విహార యాత్ర కోసం ఉపయోగించారని కామెంట్ చేయడంతో దుమారం చెలరేగింది. రాజీవ్‌తోపాటు సోనియా, పిల్లలు రాహుల్, ప్రియాంక కూడా పయనించారని మోడీ ఆరోపించారు. అయితే దీనిపై ప్రముఖ దినపత్రిక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది. ఎన్నిసార్లు రాజీవ్ యుద్ధ నౌకలను ఉపయోగించారని అడిగింది. దీనిపై భారత నౌకాదళం స్పందిస్తూ .. నేవీలో వ్యక్తిగత ప్రయానాలు నిషేధమని స్పష్టంచేసింది. ఎంతటివారినైనా తాము యుద్దనౌకలోకి అలో చేయమని తేల్చిచెప్పింది.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1987 డిసెంబర్ 28న త్రివేండ్రంలో ఐఎన్ఎస్ యుద్ధనౌకలోకి ప్రవేశించారని పేర్కొన్నది. ఆయన మరునాడు లక్ష్యదీవులో దిగారని ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆయనతోపాటు సోనియాగాంధీ కూడా ఉన్నారని తెలిపింది. అయితే వారితో ఉన్న వారి వివరాలు రక్షణశాఖ వద్ద లేదని వివరించింది. అయితే రాజీవ్‌తోపాటు విదేశీయులు కూడా ఉన్నారా అని ప్రశ్నిస్తే .. ఆ సమయంలో విదేశీయులు ఉన్నారా అనే అంశంపై తమ వద్ద సమాచారం లేదని పేర్కొన్నది. వారు ప్రయాణించిన సమయంలో రోజువారీ వ్యయానికి సంబంధించిన వివరాలు కూడా లేవని మరో సమాధానం ఇచ్చింది భారత నౌకాదళం. దీంతో ఐఎన్ఎస్ విరాట్‌లో మాజీ ప్రధాని విహార యాత్ర చేయలేదని అధికారింకగా స్పష్టమైంది. మరి దీనిపై ప్రధాని మోడీ, అధికార బీజేపీ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications