ఇరాన్ పై దాడులకు అమెరికా భారత గగనతలాన్ని వాడుకుందా ? కేంద్రం క్లారిటీ ..!
ఇరాన్ లోని అణు కేంద్రాలపై జరిపిన తాజా దాడులకు అమెరికా భారత గగనతలాన్ని వాడుకోలేదని కేంద్రం ఇవాళ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేల్చేసింది.
ఇరాన్-ఇజ్రాయెెల్ మధ్య జరుగుతున్న యుద్దంలో అమెరికా తాజాగా అడుగుపెట్టింది. ఇరాన్ లోని మూడు అణు విద్యుత్ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని భారీ బాంబు దాడులు చేసింది. ఇందులో జరిగిన నష్టం ఎంతో కచ్చితంగా తేలలేదు. కానీ అమెరికా మాత్రం ఈ అణు కేంద్రాల్ని భారీగా దెబ్బతీసినట్లు చెప్పుకుంటోంది. ఇరాన్ మాత్రం అంతగా నష్టం జరగలేదని చెబుతోంది. ఇదంతా పక్కనబెడితే ఇరాన్ పై అమెరికా జరిపిన ఆపరేషన్ నైట్ హ్యామర్ కు భారత గగనతలాన్ని వాడుకుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రంపై విమర్శలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం పీఐబీ ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య కోసం భారత గగనతలాన్ని ఉపయోగించలేదని కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టం చేసింది. తమ గగనతలాన్ని వాడుకుని ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై (ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్) 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' పేరుతో అమెరికా దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) యొక్క ఫాక్ట్ చెక్ ప్రకారం "భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించలేదని, ఈ వార్తల్లో నిజం లేదని" స్పష్టం చేసింది. కొందరు సోషల్ మీడియాలో అమెరికా, ఇరాన్‌పై దాడి చేయడానికి భారత గగనతలాన్ని ఉపయోగించిందని ఆదివారం పేర్కొన్నారు. దీనిపై పీఐబీ స్పందిస్తూ.. అమెరికా విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాయని, ఛైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్ తెలిపినట్లు పేర్కొంది.
Several social media accounts have claimed that Indian Airspace was used by the United States to launch aircrafts against Iran during Operation #MidnightHammer #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 22, 2025
❌ This claim is FAKE
❌Indian Airspace was NOT used by the United States during Operation… pic.twitter.com/x28NSkUzEh
"ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించిందని కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయని, ఇది అవాస్తవమని పీఐబీ క్లారిటీ ఇచ్చింది. భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించలేదని, ప్రెస్ బ్రీఫింగ్‌లో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కైన్, అమెరికా విమానాలు ఉపయోగించిన మార్గాన్ని వివరించారని తెలిపింది. దీంతో ఈ ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది.
ఈ ఆపరేషన్‌లో అమెరికా బి-2 స్టెల్త్ బాంబర్‌లను ఉపయోగించి ఇరాన్ లోని రెండు స్థావరాలపై బంకర్-బస్టర్ బాంబులను, ఇస్ఫాహాన్ అణు స్థావరంపై టోమాహాక్ క్షిపణులను ప్రయోగించింది. దీనిపై పెంటాగన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ యొక్క వివరణాత్మక మ్యాప్, టైమ్‌లైన్‌ను అందరికీ చూపించారు. అందులో ఏ ఒక్క అమెరికా విమానం కూడా భారత గగనతలంలోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. అమెరికాలోని మిస్సోరి నుంచి బయలుదేేరిన 125 అమెరికా యుద్ధ విమానాలు 18 గంటల పాటు ప్రయాణించి ఇరాన్ లో అణు కేంద్రాలపై దాడులు చేశాయి.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications