మమత ఔట్ -పరివర్తన్ ఇన్: మే2న జరిగేదిదే -అంపన్ తుపాను సాయం బొక్కేశారు -బెంగాల్ ర్యాలీలో మోదీ ఫైర్

గడిచిన 10 ఏళ్లుగా బెంగాల్ అభివృద్దిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనం జీవితాలతో ఆటలాడుకున్నారని, అందుకు తగ్గట్లుగానే ఎన్నికల్లోనూ టీఎంసీ 'ఖేలా హోబే(ఆట కొనసాగుతోందని)' నినాదమిచ్చిందని, అయితే, బెంగాలీలు మాత్రం దీదీ ఆటకట్టించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కోసం బుధవారం పూరబ్ మెదినిపూర్ జిల్లాకు వచ్చిన ప్రధాని మోదీ.. కాంతి సిటీలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీదీని ఇంటికి సాగనంపేందుకు బెంగాలీ మహిళలు ఇప్పటికే సిద్ధమయ్యారని, మే 2నాటి ఎన్నికల ఫలితాలతో దీదీ నిష్క్రమణ, పరివర్తన్(మార్పు) ఆగమనం ఏక కాలంలో జరుగుతాయని మోదీ చెప్పారు.

Didi out, Poriborton in, Bangla chai- BJP sarkar says PM Modi targets Mamata at Contai rally

గడిచిన 10ఏళ్ల పాలనలో దీదీ తన అసలు రూపాన్ని చాలాసార్లు బయటపెట్టుకున్నారని, అల్లుడి(అభిషేక్ బెనర్జీ) అవినీతి సామ్రాజ్యానికి అన్ని రకాలుగా సాయడ్డారని, చివరికి అంపన్ తుపాను బాధితుల కోసం కేంద్రం భారీ సహాయాన్ని ప్రకటిస్తే ఆ మొత్తాన్ని కూడా అత్తాఅల్లుళ్లు బొక్కేశారని ప్రధాని ఆరోపించారు. టీఎంసీ సర్కార్ వసూళ్లకు కూడా పాల్పడిందని మోదీ విమర్శించారు.

''అంపన్ తుపాను విలయంలో వేలాది మంది బెంగాలీలు విలవిల్లాడారు. గూడు కోల్పోయి గజగజా వణికిపోయారు. వారికి సహాయంగా కేంద్రం పంపిన మొత్తమంతా దీదీ మేనల్లుడి ఇంట్లో అటకాయించిపోయింది. ఇలా టీఎంసీ వాళ్లు ప్రజల జీవితాలో ఆటలాడుకుంటున్నారు. ఈ విషయం బెంగాల్ లోని చిన్నపిల్లకు కూడా అర్థమైపోయింది. అందుకే దీదీని సాగనంపాలని జనం డిసైడైపోయారు'' అని మోదీ వ్యాఖ్యానించారు. కాగా,

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ 'ఖేలా హుబే' నినాదంతో ప్రచారంలో దూసుకెళుతుండగా, దానికి కౌంటర్ గా బీజేపీ నినాదాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించారు. 'బంగ్లా చాయి -బీజేపీ సర్కార్' (బెంగాల్ కోరుతోంది బీజేపీ ప్రభుత్వాన్ని) అంటూ మోదీ కొత్త నినాదం ఇవ్వగా జనం కేరింతలు కొట్టారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ మార్చి 27న జరుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+