ఎవరి కూతురితోనూ లేచిపోలేదు: కేజ్రీవాల్ వ్యాఖ్య

హైదరాబాద్: లోకసభ మొదటి దశ పోలింగ్ జరుగుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. ఢిల్లీ ప్రచారంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ ర్యాలీలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు.

తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశానని, ఎవరి కూతురితోనూ లేచిపోలేదని, పాకిస్తాన్‌కు పారిపోలేదని ఆయన అన్నారు. తాను పారిపోయినట్లు కొంత మంది మాట్లాడుతున్నారని, తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉన్నాని అంటూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

 Didn't elope with anyone's daughter: Arvind Kejriwal

తమ పార్టీ అభ్యర్థి అశుతోష్ తరఫున ప్రచారం చేస్తూ కేజ్రీవాల్ తనను తాను మహాభారతంలోని అర్జునుడితో పోల్చుకున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని, కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ప్రతినాయకులుగా అభివర్ణించారు.

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దుర్యోధనుడు కృష్ణభగవానుడి దగ్గరకు వెళ్లి సైన్యాన్ని కోరుకున్నాడని, అర్జునుడు మాత్రం కృష్ణుడినే కోరుకున్నాడని, రాహుల్- మోడీలకు ధన భలం ఉందని, తమకు మాత్రం దేవుడున్నాడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+